'వరల్డ్స్ కూలెస్ట్ వింటర్'ని ఆస్వాదించండి: షేక్ మొహమ్మద్
- December 05, 2022
యూఏఈ: 'వరల్డ్స్ కూలెస్ట్ వింటర్'ని ఆస్వాదించాలని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. వరల్డ్స్ కూలెస్ట్ వింటర్ క్యాంపెయిన్ మూడవ సీజన్‌ను షేక్ మొహమ్మద్ ప్రారంభించారు. ఈ సంవత్సరం "వాల్యూస్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిపుల్ పీపుల్" థీమ్ గా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అజ్మాన్‌లోని అల్ జోరా నేచర్ రిజర్వ్‌లో జరిగిన కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూఏఈ దాని గ్రామాలు, లోయలు, పర్వతాల అందాలను పర్యాటకులకు చూపించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పిన ఒక వీడియోను షేక్ మొహమ్మద్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా అల్ జోరా వద్ద పచ్చదనంతో కూడిన సమావేశ ఫోటోలను పంచుకున్నారు. "ఈ సంవత్సరం శీతాకాల ప్రచారానికి ప్రారంభ స్థానం అజ్మాన్, దాని తెల్లని ఇసుక, ఎర్రకోట, మస్ఫౌట్ పర్వతం, మనామా లోయలు" అని షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు. షేక్ మొహమ్మద్ ప్రకారం.. వార్షిక శీతాకాల క్యాంపెయిన్ ఫలితంగా 2021లో దేశీయ పర్యాటకంలో 36 శాతం పెరుగుదల( 1.3 మిలియన్లు) నమోదైంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







