సచివాలయ భవన ప్రారంభోత్సవ o..
- April 25, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు లేవు, ఆదాయము లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం తెల్లవారుజామున ఏపీ సచివాలయ భవన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోవాలని మనం కోరుకోలేదని.. విభజన చేయాలంటే ఏపీకి న్యాయం చేయాలని చెప్పానన్నారు. రాజధాని అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉంటాయని చెప్పారు. ఉద్యోగులకు 30 శాతం హెచ్ ఆర్ ఏ ప్రకటించారు. ఉద్యోగులకు రాజధాని ప్రాంతంలో 5 వేల గృహాల సముదాయం నిర్మిస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.2,400 కోట్లు మంజూరు చేస్తూ ఫైలుపై సంతకం చేశారు. రుణ ఉపశమనంలో బ్యాలెన్స్ రూ. 178 కోట్ల విడుదల ఫైలుపై సంతకం చేశారు.'అమరావతికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నా. రైతులు, రాజధాని ప్రాంత పేదలు బాగుండాలి. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు జూన్ 15 నాటికి పూర్తవుతాయి. నాపై నమ్మకముంచి 33,500 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రపంచంలో 10 ఉత్తమమైన రాజధానుల్లో మన రాజధానుంటుంది. సీఎం అయిన వెంటనే సింగపూర్ వెళ్లి రాజధాని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని కోరాను. 6 నెలల్లో సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. జూన్ లో మంచి రోజులు లేనందున ఇవాళే సచివాలయాన్ని ప్రారంభించాం. రెండో విడత రైతు రుణమాఫీపై సంతకం చేస్తున్నట్లు' చంద్రబాబు చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







