కువైట్ జాతీయ, విమోచన దినానికి 5 రోజుల సెలవు!
- December 08, 2022
కువైట్: కువైట్ జాతీయ దినోత్సవం, విమోచన దినోత్సవం, ఇస్రా, మిరాజ్ల సందర్భంగా ఫిబ్రవరి 23, 24, 25, 26, 27వ తేదీలలో సెలవులు ప్రకటించారు. ఈ సంవత్సరం ఇస్రా, మిరాజ్ సెలవులు ఫిబ్రవరి 18 శనివారంతో సమానంగా ఉంటాయి. ఇస్రా, మిరాజ్ సెలవులను తదుపరి గురువారానికి బదిలీ చేయాలని, శనివారం సెలవును వచ్చే గురువారానికి మార్చాలని కేబినెట్ నిర్ణయించినట్లయితే వరుస సెలవులు వస్తాయి. ఫిబ్రవరి 23వ తేదీ గురువారం విశ్రాంతి దినంగా ఉంటుంది. ఫిబ్రవరి 27 (సోమవారం), ఫిబ్రవరి 25(శనివారం)కి ప్రత్యామ్నాయంగా విశ్రాంతి దినంగా పరిగణించబడుతుంది. అయితే వీటిని మంత్రి మండలి నిర్ణయించాల్సి ఉన్నది. కొత్త సంవత్సరం సెలవుదినం శుక్రవారం, , ఆదివారంతో సహా మూడు రోజులు ఉంటుంది. అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1. జనవరి 2( సోమవారం)న అధికారికంగా కార్యాలయాలు పునఃప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







