డిసెంబర్ 11న ఎమిరేట్స్ లూనార్ మిషన్ ప్రయోగం

- December 08, 2022 , by Maagulf
డిసెంబర్ 11న ఎమిరేట్స్ లూనార్ మిషన్ ప్రయోగం

దుబాయ్: ఎమిరేట్స్ లూనార్ మిషన్ కొత్త ప్రయోగ కొత్త తేదీని మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) వెల్లడించింది. రషీద్ రోవర్ ని స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా డిసెంబర్ 11న 11:38 గల్ఫ్ స్టాండర్డ్ టైమ్ (GST) లేదా 02:38 తూర్పు యూఎస్ సమయానికి ప్రయోగించనున్నారు. గతంలో ప్రయోగాన్ని వివిధ కారణాలతో నాలుగు సార్లు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రయోగించిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుని కక్ష్యను చేరేందుకు తక్కువ-శక్తి వినియోగ మార్గం ద్వారా 5 నెలలపాటు ప్రయాణించనున్నది. ఏప్రిల్ 2023లో ఇది చంద్రుని కక్ష్యను చేరే అవకాశం ఉన్నదని స్పేస్ సెంటర్ వెల్లడించింది. ప్రయోగాన్ని MBRSC లైవ్ స్ట్రీమ్‌లో www.mbrsc.ae/lunarలో చూడవచ్చని తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com