వ్యాట్, ఎక్స్‌పాట్ లెవీలో మార్పు లేదు: సౌదీ

- December 08, 2022 , by Maagulf
వ్యాట్, ఎక్స్‌పాట్ లెవీలో మార్పు లేదు: సౌదీ
రియాద్ : ప్రస్తుతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) లేదా ప్రవాస కార్మికులకు విధించే లెవీలో ఎలాంటి మార్పు లేదని సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహ్మద్ అల్-జదాన్ తెలిపారు. ఓ టెలివిజన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అల్-జదాన్ రాష్ట్ర బడ్జెట్‌పై చమురు ధరల అస్థిరత ప్రభావంలో క్షీణత ఉందని , 2022 బడ్జెట్ మిగులు పంపిణీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం మిగులులో ఏ భాగాన్ని ప్రజా రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఉపయోగించరని, పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో తగినంత లిక్విడిటీ, ఆస్తులు ఉన్నాయన్నారు. , అయితే సామా(SAMA) నిల్వలు 2022లో సుమారు SR50 బిలియన్లు పెరిగాయని ఆయన చెప్పారు. 2022లో దాదాపు SR30 బిలియన్ల మేజర్ ప్రాజెక్ట్‌ల కోసం ఖర్చు చేసామని, 2023-2024లో కూడా ఇదే విధమైన మొత్తాలను ప్రధాన ప్రాజెక్ట్‌లకు ఖర్చు చేయడం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రయివేటు రంగంపై పన్ను భారం 16.8 శాతంగా ఉందని, ఇది ప్రపంచవ్యాప్తంగా సిఫార్సు చేసిన దానికంటే తక్కువగా ఉందని, క్రమానుగతంగా అధ్యయనం చేసినప్పటికీ ప్రస్తుతం దీనిని సమీక్షించాలనే ఆదేశాలు లేవని మంత్రి పేర్కొన్నారు. సౌదీ ప్రభుత్వ రుణాల నిష్పత్తి G20 దేశాలలో సగటు కంటే చాలా తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com