ఆకాశ ఎయిర్ లైన్స్ విమాన సేవలను ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్నాథ్
- December 10, 2022
విశాఖపట్నం: ఏపీ రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు ఉండగా వాటిలో మరిన్ని నూతన సర్వీసులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా పలు ఎయిర్ లైన్స్ సంస్థలకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర భారీ పరిశ్రమలు ,ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శనివారం సాయంత్రం ఇక్కడ విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆకాశ ఎయిర్ లైన్స్ కు చెందిన నూతన సర్వీసును మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భముగా మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ ఈ నూతన సర్వీసు విశాఖ నుంచి నేరుగా బెంగళూరుకు, బెంగళూరు నుంచి విశాఖకు రాకపోకలు సాగిస్తుందన్నారు.
ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు మరిన్ని విమానాలు అదనముగా నడపడం వల్ల ప్రయాణికులకు సులభతరమైన రాకపోకలు సాగించేందుకు అవకాశం కలుగుతుంది అన్నారు.
విశాఖ విమానాశ్రయం వేదికగా ఆకాశ సంస్ధ తన సర్వీసులను ప్రారంభించడం అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విశాఖ నుంచి నూతన సర్వీసులు నడపాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరినట్లు మంత్రి చెప్పారు.. హైదరాబాద్ , ఢిల్లీ,గోవా నగరాలకు నూతన సర్వీసులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆకాంక్షించారు, ప్రస్తుతం ఆకాశ సంస్థ 9 ప్రధాన నగరాల్లో తన సర్వీసులను నడుపుతోందని విశాఖ నుంచి తన పదో శాఖ ప్రారంభించిండము అభినందనీయం అన్నారు.. విశాఖలో త్వరలో గ్లోబల్ సమ్మిట్ జరగనుందని , అలాగే జి 20 సమావేశాలకు సంబంధించి కూడా విశాఖ వేదిక కానుందని కాబట్టి మరిన్ని విమాన సర్వీసులు అవసరం ఉందన్నారు. ఆకాశ సంస్థ ప్రతినిధులు ప్రవీణ్
ఐయ్యర్ , ఆకుల అరవింద్, సాగర్ నాయక్ లు మాట్లాడుతూ ఇప్పటివరకు విశాఖతో కలుపుకొని 10 నగరాల్లో తమ సంస్థ సేవలు ప్రారంభించినట్లు చెప్పారు, త్వరలో హైదరాబాద్, లక్నో, గోవాలో తమ సంస్థ సేవలు ప్రారంభమవుతాయి అన్నారు.ప్రతిరోజు 58 సర్వీసులు దేశంలో పలు నగరాలకు నడుపుతున్నామన్నారు.ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ విమానాశ్రయం నుంచి ఆకాశ సంస్థ తన సేవలు ప్రారంభించడము అభినందనీయమన్నారు.
వారికి అవసరమైన సహకారం పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు.. త్వరలోనే మరిన్ని సర్వీసులు విశాఖ నుంచి నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రయాణికులు సంఖ్య పెరుగుతుందన్నారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గతంలో దుబాయ్ కు విశాఖ నుంచి నేరుగా ఎయిర్ ఇండియా విమానం ఉండేదని అది ప్రయాణికులకు అత్యంత సౌలబ్యముగా ఉండేది అన్నారు.. తిరిగి దుబాయ్ విమానాన్ని పునరుద్ధరించాలని, అంతేకాకుండా ముఖ్య నగరాలకు విమాన సర్వీసులు పెరిగితే ఆయా ప్రాంత ప్రజలకు మేలు కలుగుతుంది అన్నారు. ఇతర నగరాలకు వెళ్లాలంటే వేర్వేరు విమానాశ్రయాలకు వెళ్లి అక్కడ నుంచి వెళ్లాల్సి వస్తుందని ఇది భారముగా మారుతుందన్నారు.ప్రయాణీకులకు ఇబ్బందులూ తప్పడము లేదన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు ,కరణం రెడ్డి నర్సింగరావు, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విజయ మోహన్, విమాన యాన సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!
- ఖతార్ లో రమదాన్ క్యాలెండర్.. నెలంతా సందడే..!!
- ఒమానీ పౌరులకు అజర్బైజాన్ గుడ్ న్యూస్..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై పరిమితులు..!!
- బహ్రెయిన్ పౌరులకే పబ్లిక్ ఫార్మసీలు..!!
- దుబాయ్ లో పెయిడ్ పార్కింగ్ అవర్స్ రివైజ్డ్..రెండు గంటలు ఫ్రీ..!!
- సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- భారత్ లోనే కాస్ట్లీ ఎయిర్‌పోర్ట్‌గా హైదరాబాద్..
- మహిళను చంపిన పూజారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!









