ఇళ్ళ నిర్మాణం వేగవంతం: మినిస్టర్ బాసిమ్
- April 25, 2016
ఇళ్ళ నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ బషీమ్ అల్‌హమీర్ చెప్పారు. అబు దహమ్ మరియు బురి విలేజెస్‌లో అధికారులతో కలిసి పర్యటించిన మినిస్టర్ బషీమ్, స్థానికులు ఇళ్ళ కోసం పడ్తున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా డైరెక్షన్‌లో, ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి త్వరలోనే ఇళ్ళను కేటాయిస్తామని వివరించారు. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పూర్తి చేసి, లబ్దిదారులకు అందజేశామనీ, ప్రస్తుతం 25,000 హౌసింగ్ యూనిట్స్‌ని 2018 నాటికి పూర్తి చేసి, లబ్దిదారులకు అందజేస్తామని ఆయన చెప్పారు. ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి త్వరగా ఇళ్ళు లభించేలా అప్లికేషన్ ప్రాసెస్‌ని వేగవంతం చేస్తున్నామని మినిస్టర్ బషీమ్ అల్ హమిర్ వివరించారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







