ప్రమాదంలో విద్యార్థి తల్లి మృతి, విద్యార్థికి తీవ్రగాయాలు
- April 25, 2016
యూనివర్సిటీ ఆఫ్ దామమ్ గ్రాడ్యుయేషన్ హాల్ నుంచి వెళుతూ, ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ విద్యార్థిని ఖాతిర్ అల్ సలామ్‌గా గుర్తించారు. ఖాతిర్, ఆమె తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందర్నీ కలచివేసింది. రోడ్డుని దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకి అవతలివైపు ఖాతిర్ సోదరుడు ఉన్నారు. అతన్ని కలిసేందుకు వెళుతున్న సమయంలో వేగంగా వస్తున్న ఓ కారు వీరిని ఢీకొంది. గ్రాడ్యుయేషన్ సెర్మనీ నిర్వహణలో యూనివర్సిటీ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్టూడెంట్స్ విమర్శించారు. ఆన్‌లైన్ వేదికగా పలువురు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, యూనివర్సిటీపై ఆరోపణలు చేశారు. అయితే యూనివర్సిటీ ప్రతినిథులు, ప్రమాదం దురదృష్టకరమని, ఈ ఘటనలో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని వివరించారు. ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్ అక్కడికి చేరుకుని, తీవ్రంగా గాయపడ్డ ఖాతిర్‌ని ఆసుపత్రికి తరలించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







