మాదక ద్రవ్యాల విక్రయం కోసం ఫేస్‌బుక్ లో ప్రకటన.. డ్రగ్ డీలర్ అరెస్ట్
- December 13, 2022
యూఏఈ: మాదక ద్రవ్యాల విక్రయం కోసం ఫేస్‌బుక్ లో ప్రకటన ఇచ్చిన డ్రగ్ డీలర్ కు పోలీసులు షాకిచ్చారు. డ్రగ్ కావాలంటూ ఫోన్ చేసిన పోలీసులు.. అనంతరం డ్రగ్ డీలర్ ను అరెస్ట్ చేసిన జైలుకు పంపారు. ఈజిప్టులోని అల్ మెనోఫియా గవర్నరేట్‌లోని క్వెస్నా నగరానికి చెందిన ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. డ్రగ్స్ వ్యాపారి మాదక ద్రవ్యాల సరఫరా సేవలను వివరిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “ఫేస్‌బుక్”లో తన ఫోన్ నెంబర్లను పొందుపరిచాడు. ప్రకటన ఉంచిన కొన్ని గంటల తర్వాత ఈజిప్టు భద్రతా అధికారులు డ్రగ్ డీలర్‌ను సంప్రదించి.. అతన్ని అరెస్టు చేసినట్లు ఈజిప్ట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అతని వద్ద ఆరు కిలోల గంజాయి, హెరాయిన్, రెండు కిలోల "హైడ్రో" డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. భద్రతా బృందాలు అతని వద్ద ఒక తుపాకీ, అనేక బుల్లెట్లు, డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







