నకిలీ వెబ్‌సైట్‌ను నడుపుతూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ముఠా అరెస్ట్
- December 14, 2022
దుబాయ్: బంగారాన్ని విక్రయించే నకిలీ వెబ్‌సైట్‌ను నడుపుతూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ఆరుగురు వ్యక్తుల ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. బంగారాన్ని విక్రయిస్తున్న నకిలీ వెబ్‌సైట్ ద్వారా మోసపోయామని పలువురి నుంచి తమకు ఫిర్యాదులు అందాయని దుబాయ్ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగంలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కస్టమర్లు చట్టపరమైన ధర కంటే తక్కువ ఖర్చుతో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని సైట్ లో పేర్కొన్నారన్నారు. బాధితులు తమ క్రెడిట్ కార్డులను ఉపయోగించి లావాదేవీలు పూర్తి చేసినప్పుడు, కొనుగోలు పూర్తయినట్లు సందేశాలు వచ్చాయి. అయితే, వారికి బంగారం అందకపోగా వారి కార్డు డేటాను దొంగిలించి ఆయా ఖాతాల నుండి పెద్ద మొత్తంలో డబ్బును బదిలీ చేశారని తెలిపారు.
పోలీసులు సైట్‌ను ట్రాక్ చేసి.. నడిపిన వారిని గుర్తించారని అధికారి తెలిపారు. వీరి నివాసంపై పోలీసులు దాడి చేయగా ఆరుగురు నిందితులు కూడా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారందరినీ అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించి, నకిలీ వెబ్‌సైట్‌ను మూసివేయించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







