తేజపై క్రిమినల్ కేసు..
- April 25, 2016
సినీ దర్శకుడు తేజ, వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ కలప వ్యాపారి ఆర్‌వి.కృష్ణారావు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఫిలింనగర్ రోడ్ నెం.9లో నివసించే ఆర్‌వి.కృష్ణారావు టింబర్ బిజినెస్ చేస్తున్నారు.ఈ నెల 7వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఫిలింనగర్‌లోని ముక్తిధామం సాయిబాబా దేవాలయం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.12 వైపు వెళ్తుండగా విక్కి అనే వ్యక్తి కారు ఆపి ఆయనను కలుసుకొని వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ నీపై దృష్టి పెట్టాయని సినిమా దర్శకుడు తేజ ఇంటి విషయాన్ని సెటిల్ చేసుకోవాలని సూచించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ ఇంటి విషయాన్ని త్వరగా తేల్చుకోకపోతే వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. మళ్లీ ఈ నెల 13వ తేదీన సినీ డెరైక్టర్ తేజ ఇదే విషయంపై కృష్ణారావుకు ఫోన్ చేసి దూషించాడు. తనకు ఈ ముగ్గురి నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు న్యాయ సలహా కోసం ఫిర్యాదును కోర్టుకు పంపించారు. కోర్టు ఆదేశాలతో శనివారం రాత్రి ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







