అడవుల్లో దొరికిన ఎముకలు శ్రద్ధా వాల్కర్‌వే..తేల్చిన డీఎన్ఏ పరీక్ష
- December 15, 2022
న్యూఢిల్లీ: ఢిల్లీలో సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాల్కర్‌ను ఆమె భాయ్‌ఫ్రెండ్ అమీన్ పూనావాలా అత్యంత దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి .. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఆ కిరాతక మర్డర్ గురించి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నారు. సమీప అడవుల్లో శ్రద్ధా శరీర భాగాలను సేకరించిన పోలీసులు వాటిని డీఎన్ఏ పరీక్ష నిమిత్తం పంపారు. అయితే ఢిల్లీ అడవుల్లో దొరికిన ఎముకలు శ్రద్ధా వాల్కర్‌వే అని డాక్టర్లు తేల్చారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. మెహరౌలీ, గురుగ్రామ్ అడవుల నుంచి ఢిల్లీ పోలీసులు శ్రద్ధా ఎముకల్ని సేకరించారు. అయితే ఆ ఎముకలకు జరిపిన పరీక్షలో.. ఆమె తండ్రి డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







