తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్ ప్రారంభం
- December 15, 2022
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్‌ను ప్రారంభించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు గురువారం నుంచి తిరుపతి విమానాశ్రయంలోనే మంజూరు చేస్తున్నారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్‌ను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు.
శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇచ్చి టికెట్ కోసం రూ. 500 చెల్లించే భక్తులకు తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేసేవారని చెప్పారు జేఈవో. దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
విమానాశ్రయం, తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్‌లో శ్రీ వాణి టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల.. దాతలు ముందు రోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గుర్తించి టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి మాధవంలో వారికి వసతి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనివల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తిరుపతి విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు యాజమాన్యానికి జేఈవో కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







