'ధమాకా' మూవీ ట్రైలర్ విడుదల
- December 15, 2022
హైదరాబాద్: మాస్ రాజా రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ధమాకా ట్రైలర్ వచ్చేసింది. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు.
వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. డిసెంబర్ 23 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ ను స్పీడ్ చేసారు. ఇప్పటికే చిత్రంలోని పలు సాంగ్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్..ఈరోజు గురువారం చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసి ఆసక్తి నింపారు.
ఇక ట్రైలర్ డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘కోట్లలో ఒకడు వాడు.. కొడితే కోలుకోలేవు’ అంటూ యాక్షన్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్లో రవితేజ.. స్వామి, ఆనంద చక్రవర్తి అనే రెండు క్యారెక్టర్లని పోషించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆనంద చక్రవర్తి కోటీశ్వరుడి కొడుకుకాగా.. స్వామి ఉద్యోగం పోగొట్టుకుని జులాయిగా తిరిగే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ‘‘మనకి కావాల్సిన వాళ్లకి చేస్తే మోసం.. మనకి కావాలి అనుకున్న వాళ్లకి చేస్తే న్యాయం’’ అనే డైలాగ్‌ని జయరాంతో చెప్పించారు. ఈ డైలాగ్ విన్న రవితేజ.. త్రివిక్రమ్ మీ చుట్టమా సార్? అంటూ వెటకారంగా అడుగుతూ కనిపించాడు. ఓవరాల్ గా ట్రైలర్ తో ధమాకా థియేటర్స్ లలో ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు డైరెక్టర్. మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!







