ముక్కులో చుక్కల మందు వ్యాక్సిన్ కు కేంద్ర ఆమోదం
- December 23, 2022
న్యూఢిల్లీ: హైదరాబాద్ కు కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ (ముక్కులో వేసే చుక్కల మందు వ్యాక్సిన్)కు అనుమతి మంజూరు చేసినట్టు, దీన్ని కోవిన్ యాప్ లో చేర్చనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రకటించారు. దీన్ని బూస్టర్ డోస్ గా తీసుకోవచ్చని, ముందుగా ప్రైవేటు హాస్పిటల్స్ లో అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ల కార్యక్రమంలో దీన్ని కూడా చేర్చినట్టు పేర్కొన్నాయి.
కోవిన్ యాప్ లో నాసల్ వ్యాక్సిన్ ను శుక్రవారం సాయంత్రానికి యాడ్ చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో అధికారికంగా దీన్ని ఎవరైనా తీసుకునేందుకు వీలుంటుంది. వ్యాక్సిన్ సర్టిఫికేషన్ కూడా యాప్ నుంచి తీసుకోవడం సులభమవుతుంది. కరోనా మొదటి రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోస్ కు అర్హులు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ తీసుకున్న వారు అవే కంపెనీ బూస్టర్ వ్యాక్సిన్లు తీసుకోవచ్చు. వాటికి బదులు నాసల్ వ్యాక్సిన్ ను కూడా తీసుకోవచ్చు. ఎలాంటి సూదులు అవసరం లేని నాసల్ టీకా పొందేందుకు 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. దీని ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనాకు కోవాగ్జిన్, కోవిషీల్డ్, కోవోవ్యాక్స్, స్పుత్నిక్ వీ, బయోలాజికల్ ఈ కార్బోవ్యాక్స్ అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







