భారతీయ సైక్లిస్ట్ ఫయీస్ అష్రఫ్ అలీకి ఘన సత్కారం

- December 26, 2022 , by Maagulf
భారతీయ సైక్లిస్ట్ ఫయీస్ అష్రఫ్ అలీకి ఘన సత్కారం

కువైట్: భారతదేశం నుండి సైకిల్‌పై లండన్‌కు సైకిల్ పై బయలుదేరిన భారతీయ సైక్లిస్ట్ ఫయీస్ అష్రఫ్ అలీని కువైట్‌లో బదర్ అల్ సమా గ్రూప్ ఘనంగా సత్కరించింది. ఫయీస్ అష్రఫ్ అలీ తన సైకిల్ యాత్రను ఇండియాలోని కేరళలో 2022 ఆగష్టు 15న మొదలుపెట్టారు. “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” వేడుకల్లో సైకిల్ యాత్రను ప్రారంభించిన అలీ.. ఒమన్, యూఏఈ, సౌదీ, బహ్రెయిన్‌ల మీదుగా డిసెంబర్ 24న కువైట్ చేరుకున్నారు. తన సైకిల్ యాత్ర సందర్భంగా యూనివర్సిటీలు, క్యాంపస్ లలో ఫిట్‌నెస్, హెల్త్‌కేర్ పై అవగాహన, రోటరీ మిషన్  “పోలియో ఎండ్ నౌ” క్యాంపెయిన్,  ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి- మలయాళీ సంప్రదాయంపై అవగాహన, జీరో కార్బన్ ఎమిషన్ గురించి తెలిపే గో గ్రీన్ క్యాంపెయిన్, డ్రగ్ వినియోగ నిర్మూలనపై అవగాహన నిర్వహిస్తున్నారు. ఫయీస్ 35 దేశాల మీదుగా 30,000 కి.మీ ప్రయాణించి దాదాపు 450 రోజుల్లో లండన్ చేరుకోనున్నారు. ఫర్వానియాలోని బార్ద్ అల్ సమా క్లినిక్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో బదర్ అల్ సమా కంట్రీ హెడ్ అష్రఫ్ అయ్యూర్, బ్రాంచ్ మేనేజర్ అబ్దుల్ రజాక్ సమక్షంలో ఫయీస్‌ను సత్కరించి మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కోఆర్డినేటర్ సనా ఖల్ఫే, బిజినెస్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్ అహమద్ రెఫాయ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రహజన్, అబ్దుల్ ఖదీర్, మార్కెటింగ్ కోఆర్డినేటర్ ప్రీమ, షెరిన్‌లు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com