ఒమన్ లో విస్తారంగా వర్షాలు.. హెచ్చరికలు జారీ
- December 29, 2022
మస్కట్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఒమన్ సుల్తానేట్‌లోని అనేక గవర్నరేట్లలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ముసందమ్, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా, అల్ బురైమి, అల్ దఖిలియా, మస్కట్, అల్ దహిరా, నార్త్ అల్ షర్కియా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లు అల్పపీడనం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) ట్వీట్ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, వాడీలు పొంగిపొర్లుతున్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. ముసందమ్ గవర్నరేట్ తీరాలు, ఒమన్ సముద్రం, అరేబియా సముద్రానికి ఎదురుగా ఉన్న తీరాలలో అలలు ఉధృతంగా ఉంటాయని పేర్కొంది.
మస్కట్ గవర్నరేట్‌లో వివిధ తీవ్రతతో కూడిన వర్షాలు కొనసాగుతున్నందున, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లోయలు, నీటి వనరులలోకి వెళ్లే సహసం చేయొద్దని సూచించింది.ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేందుకు హెచ్చరికలు, సూచనలను ఖచ్చితంగా పాటించాలని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది.
ముత్రా రాష్ట్రంలో అత్యధికంగా 154 మిల్లీమీటర్లు, మస్కట్ రాష్ట్రంలో 113 మిల్లీమీటర్లు, అల్-సీబ్‌లో 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దిబ్బా, బర్కా, బాషర్, ఖాసబ్లలో వరుసగా 58 మిమీ, 49 మిమీ, 35 మిమీ, 31 మిమీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అల్-ఖబూరా, ధంక్, ఇబ్రి, సమైల్ రాష్ట్రాల్లో అత్యల్పంగా 2 మిమీ వర్షపాతం నమోవ్వగా.. అల్-దఖిలియా గవర్నరేట్‌లోని నిజ్వా రాష్ట్రంలో కేవలం 1 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







