శ్వాసకోశ వ్యాధులుతో జాగ్రత్త...
- April 27, 2016
గాలిలో సూక్ష్మంగా ఉండే బ్యాక్టిరియా, వైరస్‌లతో పాటు ఫంగస్, దుమ్ము, ధూళి, పుప్పోడి లాంటి పదార్థాలు ఉంటాయి. వీటికి తోడు పరిశ్రమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వివిధ రసాయన పదార్థాలు సల్ఫర్‌డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫర్ఫెడ్, క్లోరిన్ , నైట్రిక్ ఆక్సైడ్ వంటివి ఉంటాయి. ఇలాంటి రసాయన పదార్థాలు పీల్చినప్పుడు దగ్గు,కఫం, పిల్లి కూతలు, ఛాతీ పట్టూయడం జరుగుతుంది. కొందరిలో కెమికల్ నీమో నైటిస్ అనే సమస్య వస్తుంది.కొందరిలో వాతావరణ మార్పులు జరుగు తున్నపుడు వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వీరిలో జలుబు, జ్వరం, ఒళ్లు నోప్పులు, ఆకలి మందగించడం, తలపోటు వంటి లక్షణాలు ఉంటాయి. ఇలా సంవత్సరంలో రెండు మూడు సార్లు వైరస్ ఇన్షెక్షన్లు రావచ్చు. రెస్ఫిరేటరి సిన్నసషియల్ వైరస్, రైనోవైరస్, ఇన్ఫ్లూయోంజ వైరస్ దీనికి కారణం. వ్యాధి నిరోధక శక్తి మందగించినప్పుడు ఇలాంటి వారిలో న్యూమోనియా కూడా రావచ్చు.దీనికి కమ్యూనీటి ఆకైవర్డ్ న్యూమోనియా అంటారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు శ్వాసనాళాలో నుంచి వెలువడే గాలి తుంపరలు వల్ల ఒకరొనుంచి మరోకరికి జబ్బులు వస్తాయి. క్షయ వ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు వారిలో ఉండే టి.బి బ్యాక్టిరియా గాలి తుంపర్ల ద్వారా ఇతరుల ఊపిరితిత్తులలోకి చేరుకుంటాయి, ఇవి వ్యాధి నిరోధక శక్తి వలన నిస్తేజమవుతాయి. కాబాట్టి కొద్దిమందిలో మాత్రమే వ్యాధి ప్రభలే అవకాశం ఉంది.ఈ వ్యాధి ఇతరులకు రాకుండా ఉండాలంటే దగ్గినప్పుడు మొహానికి అడ్డంగా రుమాలు ఉంచుకోవడం మంచిది. కొందరలో గాలిలో ఉండే ఫంగస్ ఆస్పర్జిల్లస్, కాండిడా, పెన్సిల్లియంలు ఊపిరితిత్తులోకి న్యూమొ నియా, ఉబ్బసం, ఎక్స్ట్రిన్సిక్ ఎలెర్జిక్ అల్వియోలైటిస్ అనే వ్యాధులు కలుగచేస్తాయి. సాధారణంగా వాడే యాంటిబయాటిక్స్ వలన న్యూమో నియా తగ్గినప్పుడు ఫంగస్ న్యూమోనియా ఉందేమోనని అనుమానం కలుగుతుంది. క్యాన్సర్ వ్యాధి ఉన్న వారిలోనే కాకుండా క్యాన్సర్ మందులు వాడుతున్న వారిలో కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి.ఇతర వ్యాధుల చికిత్స కోసం ఆసుపత్రిలో అత్యధిక కాలం ఉన్న వారిలో ఇచ్చే న్యూమోనియాను హాస్పి టల్ ఆక్త్వర్డ్ న్యూమోనియా అంటారు. ఆసుపత్రి వాతావర ణంలో ఉండే బ్యాక్టీరియా సాధా రణ వాతావరణంలో ఉండే బ్యాక్టిరియా కంటే భిన్నంగా ఉం టుంది. వీటిలో కెల్సియెల్లా, సూడోమోనాస్‌లు ముఖ్యమైనవి. శక్తివంతమైన యాంటిబయా టిక్స్ వాడాల్సిన అవసరం ఏర్ప డుతుంది. ఒక్కోక్కసారి జ్వరం తగ్గకుండా ఉంటుంది. న్యూమో నియా శరీరమంతా పాకి సెప్టిసీ మియా వస్తుంది. మామూలుగా కొన్ని సూక్ష్మజజీవులు ముక్కు, గొంతులొ జబ్బేమి కలుగచేయకుండా ఉంటాయి. మత్తు పదార్థాలు సేవించే వారిలో నోటిలోని లాలాజలం, ఆహారంతో పాటు ఇవి స్వరపేటి కను దాటి శ్వాస నాళాలలోకి ప్రవేశిస్తాయి. వీటి వల్ల బ్రాంకటైటిస్, యాస్పిరేషన్ న్యూమోనియా వస్తుంది.ముత్రపిండాలు, గర్భాశయానికి చెందిన ఇన్ఫెక్షన్లు రక్తం ద్వారా శ్వాస కోశాలకు చేరి ఆక్యూట్రెస్పిరేటరి డిస్ట్రెస్ సిండ్రోమ్ అనే వ్యాధిని కలుగ చేస్తాయి, సాధారణంగా ఇటువంటి ఇన్ఫెక్షన్లు గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా, స్టెఫలోకాకస్ బ్యాక్టీరియాలకు సంబంధించినవై ఉంటాయి. చర్మంలో గానీ,. శరీరంలో ఏ ఇతర అవయాంలలో కానీ ఇన్ఫెక్షన్ వచ్చినా అది సెప్టిక్ పదార్ధాలుగా మారి రక్తం ద్వారా శ్వాసకోశాలకు చేరుతుంది. ఊపిర తిత్తులు ఇలా రక్తం ద్వారా వచ్చే క్రీములను,సెప్టిక్ ఎంబాలైలను ఫిల్టర్ చేస్తుంది. ఈ సూక్ష్మక్రీములు ఊపిరితిత్తులలో పేరుకుపోయి లంగ్ ఇన్ఫెక్ష న్ను కలుగచేస్తాయి. రుమాటిక్ హార్డ్ డిసిజ్ ఉన్న వారిలో గుండెలోని కుడిభాగం కవాటాలు ఇన్‌ఫెక్టై దాంతో శ్వాసకోశాల్లోకి ఈ ఇన్ఫెక్షన్ పల్మో నరి ఆర్డరి ద్వారా వ్యాపిస్తుంది.కాలుష్యంతో ఆరోగ్యానికి ముప్పు...రోజురోజుకి జనాభా పెరిగిపోతోంది. పరిశ్రమలు, వాహనాలతో కాలుష్యం మరింత ఎక్కువ అవుతుంది. కాలుష్య ప్రభావం మనమీద ఎంతగానో ఉంటుంది. రకరకాల రోగాలు ప్రబలుతున్నాయి. మనలో పెరుగుతున్న దురలవాట్ల ప్రభావం కూడా దీనికి తోడవుతుంది. ధూమ పానం చేసే వాళ్ల ముక్కు, గొంతుల్లో దురద, ఇన్ఫెక్షన్స్, ఆస్త్మాలాంటి వ్యాధులు రావచ్చు. పొగతాగేవాళ్లలో కొందరికి క్యాన్సర్ రావచ్చు. చిన్నప్పటి నుంచి పొగతాగే వాళ్లలో పాదాలకు రక్తప్రరణ తగ్గి బర్జర్స్ డిసీజ్ రావచ్చు. ఈ వ్యాధిలో క్రమంగా వేళ్లు, పాదాల్లోని సన్నని రక్తనా ళాలు దెబ్బతిని, రక్త ప్రసరణ లేక గాంగ్రీన్ వస్తుంది. క్రమంగా కాళ్లని తీసి వేయాల్సిన పరిస్థితి రావచ్చు.గర్భిణీ స్త్రీలు పొగతాగనే కూడదు. పక్క నుండే వాళ్లు పొగతాగినా వారి ప్రభావం వీళ్ల మీద పడుతుంది. దీనివల్ల పుట్టిన పిల్లల్లో బరువు తక్కువ ఉంటుంది. నెలలు నిండకుండానే డెలివరీ రావచ్చు. కారణం లేకుండా పిల్లలు చనిపోవచ్చు. పొగతాగడం వల్ల తాగేవారికి అనారోగ్యం కలుగు తుంది. అంతేకాదు, వీళ్లు విడిచే పొగని పీల్చే చుట్టు పక్కల వాళ్ల ఆరోగ్యం పాడవుతుంది కూడా. వాతావరణంలోకి పొగని విడిచిపెట్టే వాహనాలకు, వీళ్లకు తేడా ఉండదు. ముఖ్యంగా చంటి పిల్లల ముందు సిగరెట్ లాంటివి కాల్చడం మరీ ప్రమాదకరం. ఇలాంటి కలుషిత గాలి పీల్చడం వల్ల చిన్న పిల్లల్లో న్యుమోనియా, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలలాంటివి వస్తాయిమనం పీల్చే ఇన్హెలర్స్లో క్లోరోఫ్లోరో కార్చన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్రమంగా వాతావరణంలోకి ప్రవేశించి రేడియేషన్ దుష్ప్రభావాన్నుంచి మనల్ని కాపాడుతున్న ఓజోన్ పొరని దెబ్బతీస్తాయి. ఒజోన్ పొర దెబ్బతింటే ఫిల్టర్ కాకుండా సరాసరి వచ్చే అ్రల్టావయోలెట్ కిరణాల వల్ల స్కిన్ క్యాన్స ర్లు, కెటరాక్ట్ లాంటి వ్యాధులు రావచ్చు. ఏసీ, ఫ్రిజ్‌లోనూ ఈ క్లోరోఫ్లోరోకార్చన్లుం టాయి. పరిశ్రమలు కూడా విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి వదిలే కాలు ష్యాల వల్ల రకర కాల రోగాలొస్తున్నాయి. ఉదాహరణకి కాటన్ ఇండ్రస్టీస్లో పని చేసే వాళ్లకి యాస్టె స్టోసిస్ అనారోగ్యాలు కలుగుతాయి. ఇలాంటి వృత్తుల్లో పని చేసే వాళ్లు ముక్కుకు మాస్క్‌ని ధరించడంతో పాటు మిగతా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసు కుంటే ఆ వ్యక్తులకు కొంత మేలు జరగ వచ్చు. గానీ వాతారణ కాలుష్యం పెరుగు తుంది కదా. గాలిలో కలిసి ఉండే దుమ్ము, ధూళీ, గ్యాస్ పార్టికల్స్ సూర్యకిరణాల్లో కలసి రసాయనిక సంయోగం చెంది ఫొటోకెమికల్ సొల్యూషన్ ఉత్పత్తి అవుతంది. సల్ఫర్ డయాక్సైడ్, క్లోరిన్ లాంటి వాయువులు వాతావరణంలో కలిసిపోయి ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి.మనం ఎలా శ్వాసిస్తున్నాం మనం మామూలుగా గాలిని ముక్కు ద్వారా పీల్చుకుంటాం. శ్వాసతోనే మనం జీవిస్తాం. వాతావ రణంలో తక్కువ తేమతో ఉండే చలిగాలి సరాసరి శ్వాస నాళాల్లోకి వెళ్లకుండా ముక్కు ద్వారా వెచ్చగా అయి నీటి ఆవిరిని కూడా కలుపుకొని శ్వాసనాళాల్లోకి వెళ్తుంది. ముక్కు నుంచి నేసో ఫారింక్స్, లారింక్స్ ఆ తరువాత ట్రేకియాలోకి వెళ్తుంది. ట్రేకియా చివరి భాగంలో శ్వాసనాళం రెండుగా చీలి ఉంటుంది. వీటిని బ్రాంకై అంటారు. ఇవి విడివిడిగా ఒక్కొక్క ఊపిరితిత్తులోకి వెళ్తాయి. క్రమంగా ఈ నాళం రెండుగా చీలుతూ ఊపిరితిత్తులను ఆక్రమిస్తాయి. రెండు మి.మీ.ల కంటే సన్నగా ఉండే శ్వాసనాళాలను స్మాల్ ఎయిర్వేస్ అంటారు.ఊపిరితిత్తులలో ఈ శ్వాసనాళాల చివరి భాగాలు టెర్మినల్ బ్రాంకియోల్, రెస్పిరేటరీ బ్రాంకి యోల్, ఆల్వియోలార్ డక్ట్స్‌లోకి చేరి అంతమవుతాయి. ఈ రెండింటి మధ్య భాగంలో ఉండే ఖాళీ స్థలాన్ని మీడియస్టినమ్ అంటారు. మీడియాస్టినమ్ మధ్య భాగంలో గుండె, దాని నుంచి వచ్చే రక్తనాళాలు ఉంటాయి. ఒక్కొక్క ఊపిరితిత్తిని ఒక్కొక్క పొర ఆవరించి ఉంటుంది. ఊపిరితిత్తికి అతుక్కొని ఉండే పొరను విస్రల్‌ఫ్లూరా అంటారు. దాని పైభాగంలో ఉండే పొరని పెరైటల్ ఫ్లూరా అంటారు. ఈ రెండు పొరల మధ్య ఉండే స్థలాన్ని ఫ్లూరల కేవిటీ అంటారు.దీనిలో రక్తం నుంచి వచ్చే సీరమ్ సుమారు ఐదు నుంచి పది మి.లీ. ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









