రాబోయే రెండు రోజుల్లో యూఏఈలో భారీ వర్షాలు!
- January 06, 2023
యూఏఈ: రాబోయే రెండు మూడు రోజుల్లో యూఏఈలో కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) వెల్లడించింది. దీంతో ఈ వారాంతంలో చలిగాలుల తీవ్రత పెరుగుతుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4°Cకి పడిపోవచ్చని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) నుండి డాక్టర్ అహ్మద్ హబీబ్ పేర్కొన్నారు. దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఫుజైరా, దిబ్బాలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. అల్ ఐన్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







