బ్రిటిష్ ఎయిర్ వేస్ కొత్త యూనిఫామ్..
- January 08, 2023
లండన్: బ్రిటిష్ ఎయిర్ వేస్ కొత్త యూనిఫామ్ తీసుకొచ్చింది. 20 ఏళ్ల తర్వాత యూనిఫామ్ లో భారీ మార్పులు చేసింది. కేబిన్ క్రూలోని మహిళలు హిజాబ్ ధరించేలా మార్పులు చేసింది. పురుషులకు త్రీ పీస్ సూట్లు ధరించే ఛాన్స్ కల్పించింది. ప్రఖ్యాత బ్రిటన్ ఫ్యాషన్ డిజైనర్ ఓజ్వాల్డ్ బోటెంగ్ ఈ యూనిఫామ్ ను రూపొందించారు. యూనిఫామ్ మార్పులపై బోటెంగ్ బృందం మూడేళ్లపాటు పరిశోధనలు చేసింది.
వాస్తవానికి ఈ మార్పులు 2021లో తీసుకురావాల్సిన ఉండగా కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యం అయింది. బ్రిటిష్ ఎయిర్ వేస్ తమ వద్ద పనిచేసే మహిళా సిబ్బందికి యూనిఫామ్ లో అనేక ఆప్షన్లు ఇచ్చింది. వీటిలో హిజాబ్, జంఫ్ సూట్, డ్రెస్, స్కర్ట్, ట్రౌజర్ వంటివి ఉన్నాయి. జంప్ సూట్ ను మొదట మహిళా చెక్ఇన్ సిబ్బందిపై పరీక్షించనున్నారు.
అనంతరం ఈ ఏడాది మధ్యలో క్యాబిన్ క్రూలోని మహిళలు ధరించేలా చర్యలు తీసుకోనున్నారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ లో మొత్తం 30 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. తమ కొత్త యూనిఫామ్ ప్రత్యేకమైన బ్రాండ్ కు ప్రాతినిధ్యం వహిస్తోందని బ్రిటిష్ ఎయిర్ వేస్ చైర్మన్, సీఈవో సీన్ డోయల్ తెలిపారు.ఆధునిక బ్రిటన్ ను సూచిస్తుందని చెప్పారు.
బ్రిటన్ కు చెందిన వర్జిన్ అట్లాంటిక్ విమానయాన సంస్థ సైతం గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో తమ యూనిఫామ్ లో మార్పులు తీసుకొచ్చింది.మగ పైలట్, సిబ్బందికి స్కర్టులు ధరించే వెసులుబాటును కల్పించింది.అలాగే మహిళలు ప్యాంట్స్ ధరించేలా వెసులుబాటు ఇచ్చింది. లింగ భేదం లేకుండా ఉంచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ లైన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు









