విస్తారా ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్..
- January 08, 2023
ముంబై: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విస్తారా ప్రయాణికుల కోసం అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. శనివారం ఎనిమివ వార్షికోత్సవం సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణలపై భారీగా ఆఫర్స్ ప్రకటించింది. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఛార్జీలను విడుదల చేసింది. ‘నేటితో ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో మున్ముందుకు దూసుకుపోతున్నాం. వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో కూడిన ఛార్జీలను ప్రకటించడం సంతోషంగా ఉంది. విస్తారాలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు చేసి ప్రత్యేక ఛార్జీలను ఆస్వాదించండి.’ అని ఎయిర్‌లైన్ ప్రకటించింది.
దేశీయ ప్రయాణాలపై ఎకానమీ క్లాస్ ధర రూ. 1899 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రీమియం ఎకానమీ ధర రూ. 2,699, బిజినెస్ క్లాస్ ధర రూ. 6,999 చొప్పున వన్ వే రూట్‌తో అన్ని ఛార్జీలతో కలిపి ఇవి వర్తిస్తాయి.
ఇక ఇంటర్నేషనల్ ప్రయాణాలపై ఎకానమీ క్లాస్(ఢిల్లీ-ఖాట్మండు) రూ. 13,299, ప్రీమియం ఎకానమీ(ఢిల్లీ-ఖాట్మండు)కి రూ. 16,799, బిజినెస్ క్లాస్(ఢిల్లీ-ఖాట్మండు, ముంబై-ఖాట్మండు) రూ. 43,699 గా ఉంది. అలాగే, ఎక్స్ట్రా సీట్, అదనపు బ్యాగేజీ కోసం టికెట్ కొనుగోలుపై 23 శాతం తగ్గింపు కూడా అందిస్తోంది. కాగా, విస్తారా ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. 23 జనవరి, 2023 నుంచి 30 సెప్టెంబర్ 2023 మధ్య ప్రయాణానికి సంబంధించిన టికెట్లను 12 జనవరి 2023న అర్థరాత్రి 23:59 గంటల వరకు టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ప్రయాణికులు ఎయిర్‌లైన్ వెబ్సైట్ http://www.airvistara.com ను సందర్శించడం ద్వారా, iOS, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ల ద్వారా, ఎయిర్పోర్ట్ టిక్కెట్ ఆఫీసులలో (ATOలు), కాల్ సెంటర్ ద్వారా, ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీలు (OTA), ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ (SIA) జాయింట్ వెంచర్ అయిన ‘విస్తారా’ 2013లో స్థాపించారు. మధ్యప్రాచ్యం, ఆసియా, ఐరోపా దేశాలలో ఈ ఎయిలైన్స్ నడుస్తోంది. దేశంలోనే అగ్రగామిగా సేవలు అందిస్తోంది. అయితే, 29 నవంబర్ 2022న, టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాలో విస్తారాను విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిపాదిత విలీనం మార్చి 2024 నాటికి పూర్తవుతుందని అంచనా వేశారు. ఈ విలీనం పూర్తయితే.. ఎయిర్ ఇండియా 218 విమానాల సంయుక్త ఫ్లీట్‌తో భారతదేశంలోనే ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ క్యారియర్‌గా అవతరించనుంది.
Join us as we mark 8 glorious years of soaring through the skies with our Anniversary Sale! Enjoy special fares when flying with us. Also get flat 23% off on seat selection and excess baggage. Book Now: https://t.co/MJpP6xhF0v.
— Vistara (@airvistara) January 7, 2023
T&C Apply pic.twitter.com/tdIMMAFDEw
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







