బహ్రెయిన్‌లో BAPS దేవాలయం ఒక 'అద్భుతం': ఎస్ జైశంకర్

- January 09, 2023 , by Maagulf
బహ్రెయిన్‌లో BAPS దేవాలయం ఒక \'అద్భుతం\': ఎస్ జైశంకర్

బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (BAPS) ఆలయాన్ని "గల్ఫ్‌లో వరుసగా రెండు అద్భుతాలలో" ఒకటిగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అభివర్ణించారు. ప్రముఖ స్వామి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా “గల్ఫ్ దేశాల దినోత్సవం”లో ఎస్ జైశంకర్ మాట్లాడారు. ఒక దేవాలయం అబుధాబిలో నిర్మాణంలో ఉండగా.. మరొకటి బహ్రెయిన్‌లో నిర్మాణంలో ఉన్నదని పేర్కొన్నారు."గల్ఫ్‌లో వరుసగా రెండు అద్భుతాలు’’ జరగుతున్నాయని జైశంకర్ అభిప్రాయపడ్డారు. BAPSని స్థానిక,  ప్రపంచ సాంప్రదాయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సాంకేతికతను ఉపయోగించే సంస్థ అని కూడా పేర్కొన్నారు.

ప్రముఖ్ స్వామి ఆదర్శాలు తనకు విదేశాంగ విధానంపై కూడా స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్న జైశంకర్.. జి20తో ఉదహరిస్తూ ‘వసుధైవ కుటుంబం’ భావనను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన గల్ఫ్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com