ఏపీ-తెలంగాణ మధ్య వందేభారత్ రైలు..టైమింగ్స్, ఛార్జీల వివరాలు
- January 14, 2023
అమరావతి : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం ప్రారంభం కానుంది. ప్రారంభం రోజు వందే భారత్ రైలు ప్రత్యేక వేళల్లో నడవనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ రైలు ఆగే స్టేషన్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 14 ఎసి కోచ్‌లు ఉండే వందే భారత్ రైలులో మొత్తం 1,128 మంది ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
టైమింగ్స్
వైజాగ్ నుంచి ప్రతిరోజూ ఉదయం 5.55 గంటలకు వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 7.55 గంటలకు రాజమండ్రి, ఉదయం 10 గంటలకు విజయవాడ, ఉదయం 11 గంటలకు ఖమ్మం, మధ్యాహ్నం 12.05 గంటలకు వరంగల్, మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. వరంగల్‌కు మధ్యాహ్నం 4.35 గంటలకు, ఖమ్మం మధ్యాహ్నం 5.45 గంటలకు, సాయంత్రం 7 గంటలకు విజయవాడ, రాత్రి 8.50 గంటలకు రాజమండ్రి, రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఏసీ చైర్ కార్ ఛార్జీ
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు - రూ. 1,720
విశాఖపట్నం నుంచి రాజమండ్రికి - రూ. 625
విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్ వరకు - రూ. 960
విశాఖపట్నం నుంచి ఖమ్మం వరకు - రూ. 1,115
విశాఖపట్నం నుంచి వరంగల్ - రూ. 1,310
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు - రూ. 3,170
విశాఖపట్నం నుంచి రాజమండ్రికి - రూ. 1,215
విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్ వరకు - రూ. 1,825
విశాఖపట్నం నుంచి ఖమ్మం వరకు - రూ. 2,130
విశాఖపట్నం నుంచి వరంగల్ - రూ. 2,540
ఏసీ చైర్ కార్ ఛార్జీ
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు - రూ. 1,665
సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి - రూ. 1,365
సికింద్రాబాద్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు - రూ. 905
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు - రూ. 7,50
సికింద్రాబాద్ నుంచి వరంగల్ - రూ. 520
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు - రూ. 3,120
సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి - రూ. 2,485
సికింద్రాబాద్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు - రూ. 1,775
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు - రూ. 1,460
సికింద్రాబాద్ నుంచి వరంగల్ - రూ. 1,005
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







