అల్లు అర్జున్‌కు ‘గోల్డెన్ వీసా’ జారీ చేసిన యూఏఈ ప్రభుత్వం
- January 20, 2023
దుబాయ్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశమంతటా పుష్ప సినిమాతో చాలా పాపులర్ అయిపోయాడు. పుష్ప ముందు వరకు తెలుగు, మలయాళంలో స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పడు దేశవ్యాప్తంగా పేరు, అభిమానులని సంపాదించుకున్నాడు. బన్నీ నుంచి పుష్ప 2 సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.ఇటీవలే పుష్ప 2 సినిమా షూటింగ్ ని కూడా మొదలుపెట్టారు.
తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.దుబాయ్ ప్రభుత్వం అల్లు అర్జున్ కి గోల్డెన్ వీసా అందించింది.ఓ దుబాయ్ అధికారితో కలిసి అల్లు అర్జున్ దిగిన ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి..ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు దుబాయ్. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలో మళ్ళీ దుబాయ్ వస్తాను అని పోస్ట్ చేశాడు.దీంతో బన్నీ గోల్డెన్ వీసా అందుకోవడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ముందు.. చిత్ర పరిశ్రమకు చెందిన షారుఖ్‌ఖాన్,కమల్ హస్సన్,సంజయ్ దత్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, మమ్ముట్టి, టొవినో థామస్ తదితరులు ఆ వీసాను పొందారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







