పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- August 14, 2026
దుబాయ్: వేసవి సెలవుల్లో పిల్లలు ఎలక్ట్రానిక్ గేమ్స్ ఎక్కువగా ఆడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసులు సూచించారు. కొన్ని ఆన్లైన్ గేమింగ్ లింకులు పిల్లలను అపరిచిత వ్యక్తులతో సంభాషణలకు దారితీయవచ్చని హెచ్చరించారు.
దుబాయ్ పోలీస్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లోని చైల్డ్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ విభాగం ‘Our Children’s Safety this Summer’ అవగాహన కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు ఈ సూచనలు చేసింది.
కొన్ని గేమింగ్ లింకులు కేవలం వినోదానికి పరిమితం కాకుండా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పిల్లలు గేమ్స్ ఆడుతున్న సమయంలో ఏ వెబ్సైట్లు, లింకులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని సూచించారు.
పేరెంటల్ కంట్రోల్స్ తప్పనిసరి
పిల్లలు ఉపయోగించే గేమ్స్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల గురించి తల్లిదండ్రులు పూర్తిగా తెలుసుకోవాలని దుబాయ్ పోలీసులు సూచించారు. అలాగే ప్రైవసీ సెట్టింగ్స్, పేరెంటల్ కంట్రోల్స్‌ను యాక్టివేట్ చేయడం, పిల్లల ఫ్రెండ్ లిస్టులు, గేమ్‌లో జరిగే చాటింగ్‌ను పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పిల్లలకు అసౌకర్యం కలిగించే మెసేజ్, లింక్ లేదా వ్యక్తి నుంచి వచ్చే సంప్రదింపులను వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని అవగాహన కల్పించాలని సూచించారు.
సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయొచ్చు
ఎలక్ట్రానిక్ గేమ్స్‌కు సంబంధించిన సైబర్ నేరాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై ‘e-Crime’ ప్లాట్‌ఫామ్, 901 కాల్ సెంటర్, దుబాయ్ పోలీస్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.
పిల్లల ఆన్లైన్ భద్రతలో కుటుంబ పర్యవేక్షణ కీలకమని పేర్కొంటూ, వేసవి సెలవుల్లో పిల్లలు సురక్షితంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







