సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- August 14, 2026
రియాద్: సౌదీ అరేబియాలో వినియోగదారులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. 2026 సేల్స్ క్యాంపెయిన్‌లో భాగంగా వాణిజ్య సంస్థలు, ఆన్లైన్ స్టోర్లలో 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆగస్టు ప్రారంభంలో ప్రారంభమైన ఈ సేల్స్ క్యాంపెయిన్ అక్టోబర్ 30 వరకు కొనసాగనుంది. డిస్కౌంట్ నిబంధనలు, నిర్దేశిత ప్రమాణాలను వ్యాపార సంస్థలు, ఆన్లైన్ స్టోర్లు పాటిస్తున్నాయా లేదా అనే విషయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆన్లైన్లోనే డిస్కౌంట్ లైసెన్స్
డిస్కౌంట్లు ప్రకటించాలనుకునే వాణిజ్య సంస్థలు, ఆన్లైన్ స్టోర్లు ఎలక్ట్రానిక్ విధానంలో డిస్కౌంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాపార సంస్థలు ఈ ‘ప్రత్యేక సేల్స్ పీరియడ్’ను సద్వినియోగం చేసుకోవాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది. మూడు నెలల పాటు డిస్కౌంట్లు ప్రకటించుకునే అవకాశం ఉంటుందని, ఇందుకోసం సంస్థలకు ఏడాదికి కేటాయించే సాధారణ డిస్కౌంట్ రోజుల నుంచి ఈ రోజులను మినహాయించాల్సిన అవసరం ఉండదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇవి వినియోగదారులకు ప్రయోజనం కల్పించడంతో పాటు, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా డిస్కౌంట్ సేల్స్ నిర్వహించేందుకు ఈ ప్రత్యేక సేల్స్ క్యాంపెయిన్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







