ప్యాన్ ఇండియాపై కన్నేసిన ఇళయ దళపతి.!
- January 24, 2023
‘వారసుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని డైరెక్ట్‌గా మెస్మరైజ్ చేయాలనుకున్నాడు తమిళ హీరో విజయ్. నిజానికి విజయ్ కోరిక నెరవేరిందా ఆ విషయంలో అంటే.. కాలేదనే చెప్పొచ్చు.
దిల్ రాజు నిర్మించిన ‘వారసుడు’ రిలీజ్‌కి ముందు రాజుగారు చేసిన అతి ఓవరాక్షన్‌తో గట్టిగా దెబ్బ కొట్టింది. విజయ్ తన డబ్బింగ్ సినిమాలతోనే ఒకింత తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. స్ట్రైట్ తెలుగు సినిమా అని చెప్పుకున్న ‘వారసుడు’ మాత్రం తెలుగులో అతని కెరీర్‌కి అస్సలు యూజ్ కాలేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
ఇక, ఇప్పుడు తన మార్కెట్‌ని పెంచుకునే దిశగా ప్యాన్ ఇండియా స్థాయి సినిమా ఒక్కటైనా చేయాలని అనుకుంటున్నాడట విజయ్. ఆ క్రమంలోనే పలువురు తమిళ స్టార్ దర్శకులకు కథల విషయంలో సూచనలిస్తున్నాడట.
‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ తరహాల్లో ఆ కథలు వుండాలని చెబుతున్నాడట. చెప్పడం సరే, ఆ రేంజ్‌ని ఇంతవరకూ ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్ 1’ మరో బాహుబలి అవుతుంనుకున్నారు కానీ, అంత సీను లేదని తేల్చేశారు ప్రేక్షకులు. చూడాలి మరి, విజయ్ ఏం చేస్తాడో.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







