గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌పై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత
- January 26, 2023
రిపబ్లిక్ డే ప్రసంగంలో సీఎం కెసిఆర్ పై గవర్నర్ పరోక్ష విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అని కవిత గుర్తు చేశారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాము అని తెలిపారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కెసిఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు అని కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, ఈరోజు గవర్నర్ మాట్లాడుతూ… కొందరికి ఫామ్ హౌసులు ఉండటం కాదని… అందరికీ నివసించడానికి ఇళ్లు ఉండాలని అన్నారు. అభివృద్ధి అంటే కొత్త బిల్డింగులు కట్టడం కాదని… దేశాన్ని నిర్మించడమని చెప్పారు. జాతీయ రహదారులు, వందేభారత్ తదితర అంశాలకు సంబంధించి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







