BD15,000 మోసం కేసులో ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు

- February 01, 2023 , by Maagulf
BD15,000 మోసం కేసులో ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు

బహ్రెయిన్: ఖాతాదారుల నుండి డబ్బును తీసుకోని BD15,000 మేర కంపెనీని మోసగించాడని యజమాని ఆరోపించిన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని మైనర్ క్రిమినల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సాక్షుల వాంగ్మూలాలు, ప్రతివాదిపై వచ్చిన ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం..  క్లయింట్‌ల నుండి వచ్చిన డబ్బును కంపెనీ ఖాతాలో జమ చేయకుండా BD15,000లను తమ ఉద్యోగి సొంతానికి వాడుకున్నాడని కంపెనీ కోర్టులో దావా వేసింది. కానీ ఈ సంఘటనకు ముందు సదరు ఉద్యోగికి కంపెనీ యజమానికి గతంలో వివాదాలు ఉన్నాయని పేర్కొంటూ ఉద్యోగి న్యాయవాది దావాను కోర్టులో వ్యతిరేకించారు.తన లేబర్ బకాయిలను అభ్యర్థిస్తూ లేబర్ కేసును దాఖలు చేశాడని , వేతనాలు ఆలస్యమైనందుకు  BD 1,653.333 లను ఉద్యోగికి చెల్లించాలని కంపెనీ యజమానిని లేబర్ కోర్టు గతంలో ఆదేశించిందని న్యాయవాది వెల్లడించారు. దీనికి  ప్రతీకారం తీర్చుకోవడానికి యజమాని ఇప్పుడు తన క్లయింట్ అయినా ఉద్యోగిపై తప్పుడు ఆరోపణలు చేసాడని కోర్టులో వాదించారు. దావాను విచారించిన కోర్టు  ఉద్యోగి అపరాధానికి ఖచ్చితమైన రుజువులు లేకపోవడంతో కేసును కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com