వివాహాలకు ప్రత్యేకమైన గమ్యస్థానంగా బహ్రెయిన్‌!

- February 01, 2023 , by Maagulf
వివాహాలకు ప్రత్యేకమైన గమ్యస్థానంగా బహ్రెయిన్‌!

బహ్రెయిన్: 2023 మొదటి త్రైమాసికంలో 14 వివాహాలు నిర్వహించినట్లు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది. వివిధ దేశాలకు చెందిన ఫ్యామిలీల వివాహాలకు ప్రత్యేకమైన గమ్యస్థానంగా బహ్రెయిన్‌ నిలుస్తుందని బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) CEO డాక్టర్ నాజర్ ఖైదీ తెలిపారు. వివిధ ఖండాల నుండి మరిన్ని వివాహాలను ఆకర్షించడానికి తమ ప్రయత్నాలను రెట్టింపు చేసినట్లు వెల్లడించారు. 2023లో "వెడ్డింగ్ టూరిజం" పునరుద్ధరణకు చేపట్టిన కార్యక్రమాలు  ఫలితం ఇస్తున్నాయని పేర్కొన్నారు.  భారతదేశం, పాకిస్తాన్, చైనా, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, జోర్డాన్, లెబనాన్ఇ తర దేశాల నుండి రాబోయే రోజుల్లో మరిన్ని వివాహాలు బహ్రెయిన్ లో జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇతర దేశాల వారి వివాహాల వేడుకలను ఆకర్షించడం, అంతర్జాతీయ వివాహ నిర్వాహకులను హోస్ట్ చేయడం, వివాహ నిపుణుల నెట్‌వర్క్‌ను విస్తరించడం, సంబంధిత మార్కెట్‌లలో విస్తరణ ప్రణాళికలను చర్చించడం, వివిధ దేశాల్లోని ఇతరులతో సమన్వయం చేయడం వంటివి BTEA వ్యూహంలో ప్రణాళికలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా  ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికాల నుండి వివాహాలు, ఇతర వేడుకలకు బహ్రెయిన్‌ను ఒక ప్రత్యేకమైన గమ్యస్థానంగా ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు.  బహ్రెయిన్‌లో వెడ్డింగ్ టూరిజంను అభివృద్ధి చేయడానికి తమ ప్రణాళికలకు మంచి స్పందన వస్తుందని తెలిపారు.అంతర్జాతీయ అత్యంత ర్యాంక్ ఉన్న పర్యాటక సంస్థలు, ద్వీపాలు, బీచ్‌లు, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC), హెరిటేజ్ ఆధారిత ప్రదేశాలతో వివాహాల వేడుకలకు ఫుల్ డిమాండ్ ఉందని పేర్కొన్నారు. BTEA 2017, 2022 మధ్య 54 కంటే ఎక్కువ వివాహాలను నిర్వహించిందని, 20,000 మంది అంతర్జాతీయ అతిథులు, ఒక వివాహానికి సగటున 370 మంది హాజరవుతున్నారు. రాజ్యంలో 2017లో రెండు పెళ్లిళ్లు, 2018లో పది పెళ్లిళ్లు, 2019లో 13 పెళ్లిళ్లు, 2020లో రెండు పెళ్లిళ్లు, 2021లో ఆరు పెళ్లిళ్లు, 2022లో 21 పెళ్లిళ్లు జరిగాయని డాక్టర్ నాజర్ ఖైదీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com