పోలీసుస్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలు అందించనున్న మహారాష్ట్ర ప్రభుత్వం
- May 01, 2016
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లులో ఇక నుంచి ఫ్రీ వైఫై సదుపాయం కల్పించనున్నారు. ముంబయి, థానే, నవీ ముంబయిలోని పోలీస్ స్టేషన్లులో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ జాయిస్టర్ వెల్లడించింది. ఇప్పటికే గత నెల మార్చి నుంచి థానేలోని జిల్లా కమిషనరేట్‌తోపాటు 33 స్టేషన్లులో ఈ సదుపాయాన్ని అమలు చేస్తున్నట్లు జాయిస్టర్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఉచితంగా వైఫై సదుపాయాన్ని కల్పిస్తామన్న ప్రతిపాదనను ఆమోదం తెలిపినట్టు అడిషనల్ డీజీపీ వీవీ లక్ష్మినారాయణ తెలిపారు.
అన్ని స్టేషన్లులో ఉచిత వైఫై సదుపాయం ఉండటం వల్ల అధికారులకు ఎంతో ఉపయోగపడుతుందని.. త్వరలోనే ముంబయి, నవీ ముంబయిలో ప్రాంతాల్లో ఈ సర్వీసును అమలు చేసే ఆలోచన చేస్తామని డీజీపీ అన్నారు. మరి కొన్ని వారాల్లో అన్ని పోలీస్ ట్రైనింగ్ కేంద్రాల్లోను ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. జాయిస్టర్ ఇప్పటికే ముంబయి, థానే ఆర్టీవో ప్రధాన కార్యాలయం, మరోల్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రం, 21 ప్రభుత్వ కార్యాలయాలు, 15 కళాశాలు, నాలుగు హాస్పిటల్స్, మూడు బస్స్టేషన్లులో ఉచిత వైఫై సేవలు అందిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







