బ్రెడ్ 65
- May 01, 2016
కావలసిన పదా ర్ధాలు: బ్రెడ్ - 4 స్లైసులు, ఉల్లిపాయ - ఒకటి, మిర్చి - నాలుగు, క్యారెట్ తురుము - కొంచెం, క్యాప్సికం - ఒకటి చిన్నది, ఉప్పు, కారం - తగినంత, పెరుగు - 1 కప్పు, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, కరివేపాకు - రెండు రెమ్మలు, నూనె - తగినంత
తయారీ విధానం: ముందుగా బ్రెడ్ స్లైసెస్‌ని నీళ్ళల్లో వేసి వెంటనే పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లి, ఒక మిర్చి, క్యాప్సికం, క్యారెట్ తురుము, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి. నూనె వేడిచేసి ఈ ఉండలు వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు వేరే పానలో ఒక స్పూన నూనె వేడిచేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. కొంచెం వేగిన తరువాత బ్రెడ్ ఉండలు వేసి చిటికెడు ఉప్పు, కారం వేయాలి. ఇప్పుడు పెరుగును కొంచెం బీట్ చేసి ఇందులో వేసి సన్నని సెగపై అంతా ఇగిరిపోయి పొడిపొడిగా అయ్యేవరకూ వేయించాలి. ఒక బౌల్‌లోకి తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







