ఆయాసం తగ్గడానికి ఇంటి వైద్యం ..
- May 01, 2016
మనం ముక్కు ద్వారా తీసుకుని వదిలే గాలి మన ప్రయత్నం లేకుండా మనకి తెలియకుండా జరిగే ఒక నిరంతం సాగే ప్రక్రియ. అయితే ఎక్కువగా అందిరి పిల్లలలో వుండే సమస్య ఆయాసంగా మారింది. చిన్నప్పటి నుంచి శ్వాస మండలిలో సమస్యలు మొదలు అవుతున్నాయి. ఇలాంటి సమస్యలు వంశపారంపర్యంగా రావచ్చు. కానీ ఎక్కువ శాతం వాతావరణం వల్లనో లేదా పరిస్థితుల కారణంగా కూడా వస్తాయి.శ్వాస మండలంలోని గాలి వెళ్లే మార్గంలో గోడలు దగ్గరగా కుంచించుకుని గాలి వెళ్ళకుండా అడ్డుకోవడం వల్ల సమస్య తలెత్తడం జరుగుతుంది.అంతేకాదు శ్వాసక్రియలో ప్రధానంగా ఉండే ఊపిరితిత్తుల లోని పొరలు ఏ కారణం చేతనైనా రేగడం వల్ల కూడా ప్రధానంగా రావచ్చు. ఈ శ్వాసక్రియలో ప్రధానంగా ఉండే సమస్యల వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆయాసం ఉన్న పిల్లలు చాలా మంది ముక్కుతో ఊపిరి పీల్చుకోకుండా నోటితో పీలుస్తూ ఉంటారు. దీనికి కారణమేమిటంటే అక్కడి శ్వాసమండలిలోకి గాలి వెళుతున్న మార్గం మూసుకుపోవడం వల్ల గాలి ముక్కుతో పీల్చుకోలేక నోటితో పీల్చడం జరుగుతుంది. గాలి పీల్చలేకపోవడం వల్ల పిల్లలకు అయినా పెద్దలకైనా సరే నోటితో పీలుస్తారు. దీనితో పిల్లలు మరింత నీరసించి పోతారు. ముక్కు గొంతు జీర్ణాశయం వ్యాధుల వల్ల కూడా ఆయాసం తలెత్తవచ్చు. అయితే కొంతమందిలో కొన్ని పదార్ధాల వాసనలు, వాతావరణం పడవు. దాన్ని ఎలర్జీ అంటారు. దీని వల్ల కూడా గాలి అరలు దగ్గరగా సంకుచితమై ఆయాసం వస్తుంది. అతి నీరసం వల్ల రక్తం తగ్గినప్పుడు పాండు వ్యాధిలోనూ కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉన్నది. ఆయాసంగా ఉన్నవారు చల్లటి పదార్ధాలు, కూల్‌డ్రింక్, ఐస్ క్రీమ్‌లు, బెండకాయ, చేయదుంప, పెరుగు, కొబ్బరి,చేపలు, సొరకాయ, దుంపకాయలు, బచ్చలి కూర ఎక్కువగా పుల్లగా ఉన్న పదార్ధాలకు దూరంగా ఉండాలి. ముల్లంగి దుంప, గోధుమలు లేదా గోధుమపిండి, తేనే, వెల్లుల్లి నిరభ్యంతరంగా తినవచ్చు. అదే విధంగా ప్రతి రోజూ ఉదయం లేచిన అనంతరం ఉదయం, సాయంత్రం చిటికెడు పసుపు, ఒక చిటికెడు మెత్తని ఉప్పు,రెండు చిటికెల పిప్పళ్ళ చూర్ణం తిని వేడినీళ్ళు తాగడం మంచిది. దీని వల్ల క్రమంగా ఎలుర్జీ తగ్గిపోతుంది. అంతేకాకుండా ఉసిరికాయ పెచ్చులు, వరిపేలాలు, పటిక బెల్లం, నువ్వుపప్పు, నెయ్యి అన్నింటిని సమభాగాలుగా తీసుకుని వాటిని మర్దించి చిన్న చిన్న మాత్రలుగా చేసుకుని ఉదయం సాయంత్రం తీసుకుంటే క్రమంగా ఆయాసం తగ్గుతుంది. వేడి వేడి టి డికాషన్‌లో తొమ్మిది చుక్కలు నిమ్మరసం వేసుకుని తేనెకూడా కలుపుకుని వేడివేడిగా తాగాలి. దీని వలన ఉబ్బసం ఉన్నవారికి చాలా వరకు ఇది కూడా మందుగా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









