ఆదివారం ఇరాక్ జంట పేలుళ్లతో దద్ధరిల్లింది.
- May 01, 2016
ఇరాక్ జంట పేలుళ్లతో దద్ధరిల్లింది. ఆదివారం ఇరాక్ నగరంలో చోటుచేసుకున్న పేలుళ్ల కారణంగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 42 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతాధికారులు తెలిపారు. ఈ పేలుళ్లకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.ఇరాక్ నగరంలో తొలి పేలుడు సమోవా నగరంలోని ప్రభుత్వ కార్యాలయం వద్ద, రెండో పేలుడు కొద్ది దూరంలోని బస్టాండ్ వద్ద సంభవించింది. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఐఎస్‌కు వ్యతిరేకంగా ఇరాక్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఈ పేలుళ్లకు కారణమని తెలుస్తోంది. పేలుళ్ల నేపథ్యంలో ఇరాక్‌లోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







