12,000 రెసిడెన్షియల్ యూనిట్స్‌పై బార్వా గ్రూప్ దృష్టి
- May 01, 2016
బార్వా రియల్ ఎస్టేట్ గ్రూప్, అందరికీ అందుబాటులో ఉండే అద్దెలతో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తోంది. ఈ సంస్థ 2020 నాటికి 12,000 రెసిడెన్షియల్ యూనిట్స్‌ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నట్లు సంస్థ ఛైర్మన్ సల్మాన్ మొహమ్మద్ అల్ మహాన్నది చెప్పారు. ప్రస్తుతం 4,000 రెసిడెన్షియల్ యూనిట్స్‌ని కలిగి ఉన్న బార్వా, దీన్ని విస్తరించాలని అనుకుంటోంది. 2016 - 2020 నాటికి 15 బిలియన్ ఖతారీ రియాల్స్‌తో ఈ విస్తరణను చేపట్టనుంది. తమ ప్రాజెక్టుల్లో చాలావరకు రెసిడెన్షియల్ కోణంలోనే ఉంటాయనీ, హై మరియు మిడ్ సిగ్మెంట్స్‌లో ప్రాజెక్టులు ఎక్కువగా చేపడ్తామని సంస్థ ప్రతినిథులు వివరించారు. బార్వ విలేజ్ మరియు బార్వా దోహాలలో విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. బార్వా దోహా ప్రాజెక్ట్‌లో 1,970 అపార్ట్‌మెంట్లను 2018 నాటికి పూర్తి చేస్తారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో అపార్ట్‌మెంట్లను నిర్మించడం తమ ప్రత్యేకత అని సల్మాన్ మొహమ్మద్ వివరించారు. కమర్షియల్ మరియు రిటైల్ రంగంలో ఛాలెంజింగ్ పరిస్థితులు ఉన్న దృష్ట్యా, అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







