ఫ్లైయింగ్ లో శిక్షణ తీసుకుంటున్న కార్తీక్..
- May 02, 2016
విలక్షణ దర్శకుడు మణిరత్నం సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న హీరో కార్తి తన పాత్రలో ఒదిగిపోయేందుకు కసరత్తు ప్రారంభించాడు. ఇంకా పేరు పెట్టని ఈ తమిళ చిత్రంలో అతడు పైలట్ పాత్రలో నటించనున్నాడు. ఇందుకోసం పైలట్ క్రాష్ కోర్సులో చేరి శిక్షణ పొందుతున్నాడు.'ఫ్లైయింగ్ లో కార్తి శిక్షణ తీసుకుంటున్నాడు. పైలట్ స్థానంలో ఎలా కూర్చోవాలి, విమానం నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ట్రైనింగ్ ఇస్తారు. రెండు మూడు వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఇది పూర్తైన తర్వాత షూటింగ్ లో పాల్గొంటార'ని చిత్ర వర్గాలు వెల్లడించాయి.రొమాంటిక్ డ్రామా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్నారైగా కార్తి కనిపించనున్నాడు. స్వదేశానికి వచ్చినప్పుడు లేడీ డాక్టర్ ను ప్రేమిస్తాడు. హీరోయిన్ గా అదితిరావు ఎంపికైంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







