అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్
- February 09, 2023
న్యూ ఢిల్లీ: అదానీ గ్రూప్ కి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. అదానీ గ్రూప్ కి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై విచారణకు కోర్టు ఒప్పుకుంది. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
అదానీ గ్రూప్ పై త్వరితగతిన విచారణ చేపట్టాలని న్యాయవాది విశాల్ తివారీ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హిండెన్ బర్గ్ నివేదిక దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని, ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం ఉంటుందని తివారీ తన పిల్ లో పేర్కొన్నారు. హిండెన్ బర్గ్ నివేదికపై మీడియా అత్యుత్సాహం మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు తాను దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు శర్మ.
అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్.. అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసింది. దీనిపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై శుక్రవారం విచారణ జరపనుంది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలన్నది పిటిషనర్ల అభ్యర్థన. అదానీ అంశంపై సుప్రీంకోర్టులో రెండు పిల్స్ దాఖలయ్యాయి. న్యాయవాది ఎంఎల్ శర్మ, విషాల్ తివారీ ఈ పిల్ లు దాఖలు చేశారు.
హిండెన్ బర్గ్ నివేదిక ఇన్వెస్టర్లను ఎంతో నష్టానికి గురి చేసినట్టు పిటిషనర్లు ఆరోపించారు. దేశ ప్రతిష్టను హిండెన్ బర్గ్ నివేదిక దెబ్బతీసిందని, ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం ఉంటుందని తివారీ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. హిండెన్ బర్గ్ నివేదికపై మీడియా అత్యుత్సాహం మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసినట్టు ఎంఎల్ శర్మ తాను దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో పేర్కొన్నారు. తన ఆరోపణలకు ఆధారాలను చూపించడంలో హిండెన్ బర్గ్ సంస్థ అధినేత నాథర్ అండర్సన్ విఫలమైనట్టు వివరించారు.
అదానీ గ్రూప్ తన షేర్ల ధరలు, ఖాతాల్లో మోసాలకు పాల్పడుతున్నట్టు హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపించడం తెలిసిందే. సెబీ సైతం హిండెన్ బర్గ్ అంశాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. అయితే, హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది.
మరోవైపు ఈ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తోంది. హిండెన్ బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి.అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్ చేశాయి. దీనిపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా, అదానీకి మోదీ సహకారం ఉందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







