పౌరసత్వాన్ని వదులుకున్న 16 లక్షల మంది భారతీయులు...
- February 09, 2023
న్యూ ఢిల్లీ: గడిచిన పుష్కర కాలంలో సుమారు 16 లక్షల మంది భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రకటించింది. ఇందులో అత్యధికంగా గత ఏడాది 2,25,620 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ ఈ వివరాలను వెల్లడించారు. 2011 నుంచి 2022 వరకు గల వివరాలను కేంద్రం వెల్లడించింది.
2011లో 1,22,819 మంది, 2012లో 1,20,923 మంది, 2013లో 1,31,405 మంది, 2014లో 1,29,328 మంది, 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది.. ఇక 2022లో 2,25,620 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ 12 ఏళ్లలో అత్యధికంగా 2022లో తమ పౌరసత్వాన్ని వదులుకోగా, అత్యల్పంగా 2020లో 85,256 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. దీంతో మొత్తంగా 2011 నుంచి 2022 డిసెంబర్ ముగిసేనాటికి 16,63,440 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.
ఒక నిర్దిష్ట ప్రశ్నకు కేంద్ర మంత్రి జయశంకర్ స్పందిస్తూ గత మూడేళ్లలో ఐదుగురు భారతీయులు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరసత్వాన్ని పొందారని వెల్లడించారు. అయితే భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు..మొత్తంగా 135 దేశాల్లో పౌరసత్వాన్ని పొందారు.ఆ వివరాలను కూడా కేంద్ర మంత్రి జయశంకర్ పార్లమెంటుకు అందించారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







