తెలంగాణలో రూ.1000 కోట్లతో మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రం
- February 09, 2023
హైదరాబాద్: మహీంద్రా అండ్ మహీంద్రా తన లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.ప్రస్తుతం జహీరాబాద్‌లో ఉన్న తన ప్లాంట్ కి అనుబంధంగా ఈ నూతన తయారీ ప్లాంట్ రానునట్లు తెలిపింది.
ఈరోజు ఈ మేరకు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా కంపెనీ తన లాస్ట్ మొబిలిటీ వ్యాపారంలో భాగంగా 3 & 4 వీలర్ వాహనాలను తయారు చేయునట్లు తెలిపింది.తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రకటన తర్వాత జరిగిన చర్చల్లో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఈమేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం జహీరాబాద్ లో ఉన్న తయారీ ప్లాంట్ ను విస్తరించేందుకు ఈ అవగాహన ఒప్పందం ఉపకరిస్తుంది. సుమారు 1000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ విస్తరణ ద్వారా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భవిష్యత్తులోనూ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే అంశం పైన తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
భారతదేశంలో సస్టైనబుల్ మొబిలిటీ రంగాన్ని మరింతగా వృద్ధిపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లక్ష్యాలకు అనుగుణంగా ఈరోజు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదిరిందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాలుగు మెగా ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో జహీరాబాద్ ఒకటని, మహీంద్రా అండ్ మహీంద్రా అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జేజురికర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ కంపెనీకి జహీరాబాద్ లో ఉన్న తయారీ ప్లాంట్ ను మరింత విస్తరించడం ద్వారా త్రీ వీలర్ కేటగిరీలో మరిన్ని వాహనాలను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు ప్రకటించిన తాజా పెట్టుబడితో త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కేటగిరిలో మహీంద్రా అండ్ మహీంద్రా స్థానం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మంత్రి కే. తారక రామారావు తో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







