జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- June 28, 2026
జూలై 2026 వచ్చేస్తోంది..మీకు వచ్చే నెలలో బ్యాంకులో పని ఉందా? ప్రతి నెలా మాదిరిగానే వివిధ నగరాల్లోని బ్యాంకులు అనేక పండగులు, ఇతర ప్రభుత్వ సెలవుల కారణంగా కొన్ని రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మీరు వచ్చే నెలలో ఏదైనా పని మీద బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే..మీరు ముందుగా బ్యాంకు సెలవులు ఏయే రోజుల్లో ఉన్నాయో చెక్ చేసుకుని వెళ్లడం బెటర్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు బ్యాంకులకు సెలవు ఉందో వివరిస్తూ, బ్యాంకు (Bank Holidays in July 2026)సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ జూలై బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం.. వచ్చే నెల జూలైలో బ్యాంకులు మొత్తంగా 12 రోజుల పాటు పనిచేయవు.. ఆయా తేదీల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జూలై 6 బ్యాంకులకు సెలవు:
జూలై 6వ తేదీన కేవలం ఒకే నగరంలో బ్యాంకులు మూతపడతాయి. ఆ నగరం ఐజ్వాల్. MHIP దినోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 6వ తేదీన ఐజ్వాల్‌లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
జూలై 9 బ్యాంకు సెలవు:
జూలై 9వ తేదీన కేవలం షిల్లాంగ్ నగరంలో మాత్రమే బ్యాంకులు మూతపడతాయి. బెహ్ దేయిన్‌ఖ్లామ్ పండుగ సందర్భంగా జూలై 9న షిల్లాంగ్‌లోని బ్యాంకులు పనిచేయవు.
జూలై 16 బ్యాంకులకు సెలవు:
దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో జూలై 16వ తేదీన బ్యాంకులు మూతపడతాయి. ఈ నగరాల్లో భువనేశ్వర్, డెహ్రాడూన్, ఇంఫాల్, షిల్లాంగ్ ఉన్నాయి. రథయాత్ర, కాంగ్ (రథయాత్ర), హరేలా పండుగల సందర్భంగా ఈ నగరాల్లోని బ్యాంకులు జూలై 16వ తేదీన మూతపడతాయి.
17 బ్యాంకులకు సెలవు:
జూలై 17న టిరోట్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని షిల్లాంగ్‌లోని బ్యాంకులు కేవలం ఒకే నగరంలో మూతపడతాయి.
జూలై 18న సెలవు:
జూలై 18న గాంగ్‌టక్ నగరంలో మాత్రమే బ్యాంకులు మూతపడతాయి. ద్రుక్పా త్షే-జి పండుగ సందర్భంగా జూలై 18న గాంగ్‌టక్‌లో బ్యాంకులు మూతపడతాయి.
22 జూలై సెలవు:
జూలై 22వ తేదీన కేవలం అగర్తలా నగరంలో మాత్రమే బ్యాంకులు పనిచేయవు. ఖర్చీ పూజ సందర్భంగా ఈ తేదీన బ్యాంకులు మూతపడతాయి.
అదనంగా, జూలైలో మొత్తం 4 ఆదివారాలు, 2 శనివారాలు జూలై 5, 12, 19, 26 తేదీలలో, అలాగే జూలై 11, 25 తేదీలలో బ్యాంకులు పనిచేయవు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..
- సౌదీ అరేబియాలోని జాజాన్‌లో యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాలకు కొత్త వ్యవస్థ..!!
- తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ సేవలకు కొత్త టెండర్.. ఆపరేటర్ మారే అవకాశం..!!







