టర్కీ, సిరియాలో రెస్క్యూ ఆపరేషన్.. ప్రాణాలతో బయటపడ్డ పలువురు
- February 13, 2023
యూఏఈ: టర్కీ, సిరియాలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం అనంతరం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆరు రోజుల తర్వాత ఆదివారం శిథిలాల నుండి మరింత మంది ప్రాణాలతో బయటపడ్డారు. మరోవపు రెండు దేశాలలో మృతుల సంఖ్య 28వేలు దాటింది. 1939 తర్వాత టర్కీలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదేనని టర్కీ అధికారులు చెబుతున్నారు. టర్కీలోని ఆగ్నేయ ప్రావిన్స్ హటేలో రొమేనియన్ రెస్క్యూ టీమ్ ముస్తఫా అనే 35 ఏళ్ల వ్యక్తిని ఒక భవనం నుండి శిధిలాల నుంచి 149 గంటల తర్వాత సజీవంగా రక్షించింది.అలాగే సిరియా హటేలో ధ్వంసమైన భవనం శిథిలాల నుండి 12 ఏళ్ల బాలికను రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. ఇదిలా ఉండగా కొన్ని వారాల్లో పునర్నిర్మాణ కార్యక్రమాలను పున:ప్రారంభిస్తామని అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. ఈ భూకంపం ఈ శతాబ్దంలో ప్రపంచంలోని ఏడవ అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యంగా నిపుణులు చెబుతున్నారు. 2003లో ఇరాన్లో సంభవించిన భూకంపం కారణంగా 31వేల మందికిపైగా మరణించారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







