ప్రపంచంలోనే అతిపెద్ద బిష్త్‌తో కువైట్ కొత్త గిన్నిస్ రికార్డు

- February 13, 2023 , by Maagulf
ప్రపంచంలోనే అతిపెద్ద బిష్త్‌తో కువైట్ కొత్త గిన్నిస్ రికార్డు

కువైట్: ప్రపంచంలోనే అతిపెద్ద బిష్త్‌తో కువైట్ కొత్త గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను సాధించింది. 360 మాల్‌లో ప్రదర్శించబడిన బిష్త్ 17 నుండి 16 మీటర్ల పరిమాణంతో ప్రపంచంలోనే అతిపెద్దది. అల్-బాగ్లీ ఎగ్జిబిషన్ ఈ బిష్త్ తయారు చేయించింది. దానిని కుట్టడానికి 48 రోజులు పట్టింది. గతంలో సౌదీ అరేబియా 17 బై 9 మీటర్లతో బిష్త్ చేసి రికార్డు నమోదు చేసింది. బిష్త్ ప్రదర్శన సందర్భంగా బిష్త్ అల్-బాగ్లీ ఎగ్జిబిషన్ యజమాని రియాద్ అల్-బాగ్లీని గిన్నిస్ బుక్ అక్రెడిటెడ్ ఆర్బిట్రేటర్ కెంజి అల్-దఫ్రావి సత్కరించారు. బిష్త్ అనేది అరబ్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ పురుషుల వస్త్రం.  సాధారణంగా ప్రత్యేక సందర్భాలలో ప్రతిష్ట కోసం దీనిని ధరిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com