‘దసరా’ పైనే దిల్ రాజు ఆశలన్నీ.!

- February 15, 2023 , by Maagulf
‘దసరా’ పైనే దిల్ రాజు ఆశలన్నీ.!

ఈ మధ్య ‘వారసుడు’ సినిమాతో గట్టిగా దెబ్బ తినేశాడు నిర్మాత దిల్ రాజు. దాంతో, ఇప్పుడు ‘దసరా’ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని గట్టిగా లాభపడాలని అనుకుంటున్నాడట.
స్పెషల్ స్కెచ్‌తో ముందుకెళుతున్నాడట. నేచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమా పై బజ్ బాగుంది. నాని కూడా పూర్తి నమ్మకంగా వున్నాడు. ప్రచార చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స వస్తోంది. దాంతో, ‘దసరా’ ఓ హిట్ సినిమా అని టీమ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు.
దాంతో, దిల్ రాజు ప్రమోషన్లను వేగవంతం చేశారు. తనదైన శైలిలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ధియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నారు. అన్నట్లు ఈ సినిమాతో ప్యాన్ ఇండియాపై నాని కన్నేసిన సంగతి తెలిసిందే. 
తెలుగుతో పాటూ, తమిళ, కన్నడ తదితర భాషల్లో ఈ సినిమా రిలీజవుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com