కొత్త సినిమా ప్రకటించిన యువ హీరో తనిష్
- February 16, 2023
హైదరాబాద్: బాల నటుడిగా అనేక చిత్రాల్లో నటించి, అనంతరం హీరోగా మారాడు తనిష్. నచ్చావులే చిత్రంతో కథానాయకుడిగా మారిన తనిష్ ఆ తర్వాత ‘మేం వయసుకు వచ్చాం’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ ‘రైడ్’ వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా చేశాడు.
ఆ తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ వరుసగా చిత్రాలు చేస్తూ, ప్రేక్షుకుల్ని అలరిస్తున్నాడు. తాజాగా తనిష్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ‘కేసీపీడీ (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్)’ పేరుతో ఈ సినిమా తెరకెక్కున్నట్లు వెల్లడించాడు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.వేద ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై, గోదావరి ఆంధ్రా రెస్టారంట్ దుబాయ్ వారి సహకారంతో కార్తీక్ రెడ్డి, వరుణ్ దగ్గుబాటి నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
గౌతమ్ మన్నవ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుండగా శుభశ్రీ రాయగురు, దివ్యా దిచోల్కర్, ప్రియాంక నిర్వాణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేటి యువత ఆలోచనలకు అనుగుణంగా, ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, వచ్చే సమ్మర్లోనే చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







