షార్జా అగ్ని ప్రమాదాల్లో 30 శాతం తగ్గుదల
- May 02, 2016
షార్జాలో అగ్ని ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది తొలి క్వార్టర్లో 30 శాతం తగ్గుదలతో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి గత ఏడాది ఇదే సమయంలో జరిగిన ప్రమాదాల సంఖ్యను పోల్చినప్పుడు సార్జా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దుల్లా అల్ సువాది మాట్లాడుతూ, సివిల్ డిఫెన్స్ చేపడ్తున్న చర్యలు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, వాటిని అదుపు చేయడమే కాకుండా, అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి? వాటిని ఎలా తగ్గించాలి? అనే అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించగలుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఎమిరేట్‌లో ముఖ్యమైన ప్రాంతాల్లో ఇంకా అదనంగా ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారాయన. హై రైజ్ టవర్స్‌లో ఫ్లేమబుల్ మెటీరియల్స్ వినియోగాన్ని తగ్గించేలా యూఏఈ కొత్త పాలసీ తీసుకురానుందని అల్ సువాది చెప్పారు. కన్స్ట్రక్షన్ మరియు కన్సల్టెంట్ కంఎనీలతో జరిగిన సమావేశంలో సివిల్ డిఫెన్స్ తరఫున సువాది ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







