టూరిస్టులకే కాదు, ఇంగ్లిష్ లెర్నర్స్ కు గమ్యస్థానంగా దుబాయ్..!
- February 17, 2023
దుబాయ్: కుటుంబ సెలవులు, విదేశీ గృహాల కోసం వెతుకుతున్న వ్యక్తులకు దుబాయ్ మొదటి ఎంపిక అన్న విషయం తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు ఆంగ్ల భాషను నేర్చుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా కూడా ఉందని తెలుసా? గత రెండేళ్లలో 80 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థులు దుబాయ్ లో ఇంగ్లీషు భాషను మెరుగుపరచుకోవడానికి వచ్చి వెళ్లారు. "నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి దుబాయ్‌ని ప్రీమియం గమ్యస్థానంగా చూస్తున్నారు" అని ఇంగ్లీష్ స్టడీస్ (ES) దుబాయ్ సీఈఓ, వ్యవస్థాపకుడు మోంట్‌సెరాట్ టేలర్ చెప్పారు. 2020 నుండి 9,000 కంటే ఎక్కువ విదేశీ విద్యార్థులకు ఇంగ్లిష్ క్లాసులను తసుకున్నట్లు టేలర్ తెలిపారు. 2010లో టేలర్ దుబాయ్‌కి వచ్చి, తమ్ముడు డేనియల్ రోడ్రిగ్జ్‌తో కలిసి ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు.
గత రెండేళ్లలో ES దుబాయ్‌లో చేరిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో టర్కీ (1,083) అగ్రస్థానంలో ఉందని, రష్యా (1,062), కొలంబియా (1,055), బ్రెజిల్ (1,021) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని మోంట్‌సెరాట్ టేలర్ చెప్పారు. జపాన్ (848), థాయ్‌లాండ్ (804), ఫ్రాన్స్ (597), ఇటలీ (513), సౌదీ అరేబియా (402), ఉక్రెయిన్ (198) విద్యార్థులను కూడా ఉన్నారని తెలిపారు. ఇక వేసవి తరగతులకు హాజరయ్యే 14 -17 సంవత్సరాల మధ్య వయస్సు గల 2,500 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారన్నారు.
2013లో రిచర్డ్ లూయిస్‌తో కలిసి స్పీక్ ఇంగ్లిష్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించిన జేక్ బోర్లాండ్ మాట్లాడుతూ.. ప్రారంభంలో ప్రధానంగా దుబాయ్ నివాసితులే ఇంగ్లిష్ క్లాసులకు వచ్చేవారని తెలిపారు. అయితే, కోవిడ్ -19 మహమ్మారి దుబాయ్‌లో ఆంగ్ల భాషా ప్రధాన్యాన్ని మార్చివేసిందన్నారు. యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ వంటి దేశాలు తమ సరిహద్దులు మూసివేయడంతో.. ప్రజలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి దుబాయ్‌ని గమ్యస్థానంగా చూడటం ప్రారంభించారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి నెలా 15 -40 అంతర్జాతీయ విద్యార్థులు తమదగ్గరకు ఇంగ్లిష్ నేర్చుకునేందుకు వస్తున్నారని తెలిపారు. తమ వద్దకు వచ్చే విదేశీ విద్యార్థులలో ఎక్కువ మంది జపాన్, కొలంబియా, బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలవారు ఉన్నారని చెప్పారు.
100 దేశాలకు చెందిన 1,850 మంది విద్యార్థులను కలిగి ఉన్న స్విస్ ఇంటర్నేషనల్ స్కూల్ దుబాయ్.. గత రెండేళ్లలో యూరప్, ఆసియాలోని కుటుంబాల నుండి డే స్కూల్ స్థలాలకే కాకుండా బోర్డింగ్ స్థలాలకు కూడా ఆసక్తి, డిమాండ్ గణనీయంగా పెరిగిందని తెలిపింది. కుటుంబాలు వారి పిల్లలకు మాతృభాషతోపాటు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరికతో ఉన్నారని మార్కెటింగ్, అడ్మిషన్ హెడ్ అలిసన్ రాబర్ట్స్ చెప్పారు.
దుబాయ్‌లోని ఎక్స్ఛేంజ్ విద్యార్థులు ఒక సంవత్సరం వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆదాయ రుజువును చూపించాల్సిన అవసరం లేదు. రిటర్న్ టిక్కెట్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఎక్స్ఛేంజ్ విద్యార్థి ఎమిరేట్స్ IDని పొందుతారు. ఇందులో ప్రాథమిక వైద్య బీమా ఉంటుంది.బ్యాంక్ ఖాతాను తెరవడానికి వారిని అనుమతిస్తుంది. ఈ కారణాలతోనే ఐరోపా, ఉత్తర అమెరికాలోని సారూప్య పాఠశాలలతో పోల్చితే చాలా మంది దుబాయ్‌ని ఎంచుకుంటారని ఇంగ్లిష్ ఇన్‌స్టిట్యూట్‌ల నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







