ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- March 18, 2026
అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రాంతీయంగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అంతర్జాతీయ భద్రత, స్థిరత్వం పై వాటి తీవ్ర ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
యూఏఈ మరియు జీసీసీ లోని ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులను భారతదేశం ఖండిస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అలాగే, తన భద్రత, సార్వభౌమత్వం మరియు ప్రజల క్షేమాన్ని కాపాడుకోవడానికి యూఏఈ తీసుకుంటున్న చర్యలకు భారతదేశం సంఘీభావం తెలుపుతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుత సంక్షోభాలను నివారించి, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించే విధంగా ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మరియు దౌత్య మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను తక్షణమే నిలిపివేయాలని ఇరువురు నేతలు సంయుక్తంగా పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







