SS రాజమౌళి చేతులమీదుగా MM శ్రీలేఖ వరల్డ్ టూర్ పోస్టర్ ఆవిష్కరణ
- February 18, 2023
హైదరాబాద్: ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ MM శ్రీలేఖ, సినిమా రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 25 దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు ప్రపంచ ప్రక్యాత డైరెక్టర్ SS రాజమౌళి. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ప్రపంచంలో,5 భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ mm శ్రీలేఖ, తన అచీవ్‌మెంట్స్ కి అభిననందనలు అందించారు.
ఆస్కార్ కు వెళుతున్న రాజమౌళి అన్న చేతులమీదుగా తన వరల్డ్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉందని, రాజమౌళి దర్శకత్వం వహించిన మొట్టమొదటి టెలి సీరియల్ "శాంతినివాసం" కి తాను మ్యూజిక్ అందించానని, ఇప్పుడు తన టూర్ పోస్టర్ అన్న ద్వారా రిలీజ్ కావడం ఎంతో సంతోషం గా ఉందని తెలిపారు. రవి మెలోడీస్ బానర్ ద్వారా Investors Groves Pvt. Ltd. సహకారంతో మిడిల్ ఈస్ట్ నుంచి మొదలై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు 25 దేశాల ఓ 25 మంది సింగర్స్తో కలిసి ఈ మ్యూజిక్ టూర్ జరుగుతుందని శ్రీలేఖ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







