‘పులి మేక’: లావణ్య యాక్షన్ మోడ్ ఆన్.!
- February 21, 2023
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఈ మధ్య సినిమాలకు కాస్త దూరంగా వుంది. అందుకు కారణం మంచి అవకాశాలు రాకపోవడం కూడా ఓ కారణం కావచ్చనుకోండి. అయితే, ఈ ముద్దుగుమ్మ రెట్టించిన ఉత్సాహంతో ఓటీటీలో సందడి చేయబోతోంది.
లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ పోషించిన ‘పులి మేక’ వెబ్ సిరీస్ ఈ నెల 24 నుంచి జీ 5 ఓటీటీ వేదికగా స్ర్టీమింగ్ కాబోతోంది. పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించింది ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి. పెద్ద తెరపై లావణ్య ఎప్పుడూ కనిపించని సీరియస్ అండ్ పవర్ ఫుల్ రోల్ ఇది.
ఈ సిరీస్ కోసం యాక్షన్ సన్నివేశాలూ ఇరగదీసేసింది లావణ్య. ఓ వైపు పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తూనే, దుష్ట శిక్షణ కావించేందుకు గన్ను చేత పట్టిన అమ్మోరు పాత్రలోనూ లావణ్య కనిపిస్తోంది. ఈ మధ్య వెబ్ సిరీస్‌ల ద్వారా పలువురు సీనియర్ నటీ నటులు మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
అలాగే, ‘పులి మేక’ సిరీస్ లావణ్య త్రిపాఠి కెరీర్‌కి ఎంత మేర యూజ్ అవుతుందో చూడాలిక.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







