సంక్రాంతి బొమ్మలకి ఓటీటీ రెస్సాన్స్ ఎలా వుండబోతోందో.!
- February 21, 2023
సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మూడు పెద్ద సినిమాలు తలపడిన సంగతి తెలిసిందే. అందులో ‘వీర సింహారెడ్డి’ ముందుగా వచ్చింది. మంచి ఓపెనింగ్స్ కొట్టేసింది. తర్వాత వచ్చిన వారసుడు రివర్స్ గేర్ వేసింది. ఇక ముచ్చటగా మూడో స్థానంలో వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ గట్టిగా కొట్టాడు.
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫుల్ గ్రేస్ చూపించాడు. మాస్ రాజా రవితేజ కాంబినేషన్‌తో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మూవీ ఇది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అసలు సిసలు సంక్రాంతి సినిమాగా నిలిచింది.
ఇక ఇప్పుడు ఓటీటీ టైమొచ్చింది. ఓటీటీలో మొదటగా ‘వారసుడు’ రాబోతున్నాడు. ఫిబ్రవరి 22 నుంచి ఈ సినిమా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ర్టీమింగ్ కానుంది. ఆ తర్వాతి రోజు నుంచి అనగా ఫిబ్రవరి 23న బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమా డిస్నీ హాట్ స్టార్ వేదికగా స్ర్టీమింగ్ కానుంది. సివరాఖరిగా ‘వీరయ్య’ రాబోతున్నాడు.
చూడాలి మరి, ఓటీటీలో ఈ సంక్రాంతి సినిమాలకు రెస్పాన్స్ ఎలా వుండబోతోందో.! అన్నట్లు ఇటీవలే ధియేటర్లో సందడి చేసిన సందీప్ కిషన్ ‘మైఖేల్’ కూడా వుందండోయ్. 24న ‘మైఖేల్’ ఓటీటీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..